ETV Bharat / bharat

Union Budget 2023 :​ అమృత కాలపు బడ్జెట్​.. నవభారతానికి బలమైన పునాది : మోదీ - income tax slabs

union budget 2023
union budget 2023
author img

By

Published : Feb 1, 2023, 9:16 AM IST

Updated : Feb 1, 2023, 2:28 PM IST

14:24 February 01

అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి బలమైన పునాది: ప్రధాని

  • పేద, మధ్యతరగతి ప్రజల కల సాకారం చేసేలా బడ్జెట్‌ ఉంది: ప్రధాని
  • గ్రామీణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన: ప్రధాని
  • అమృత కాలంలో రూపొందించిన చరిత్రాత్మక బడ్జెట్‌ ఇది: ప్రధాని
  • అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి బలమైన పునాది: ప్రధాని
  • రైతులు సహా అన్నివర్గాల కలలను నేరవేరుస్తుంది: ప్రధాని
  • మహిళా సాధికారతకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన: ప్రధాని

14:04 February 01

నెమ్మదించిన స్టాక్​ మార్కెట్లు

బడ్జెట్​ ప్రవేశపెట్టిన సమయంలో జోరు మీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త నెమ్మదించాయి. ఒకానొక సమయంలో 1100 పాయింట్లకు పైగా చేరిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​ 300 పాయింట్ల దిగువకు చేరింది. ప్రస్తుతం 59,845 జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ ఒక దశలో 290 పాయింట్ల వద్ద ఉన్న సూచీ 50 పాయింట్ల దిగువకు చేరింది. ప్రస్తుతం 17,700 పాయింట్ల వద్ద ఉంది.

13:32 February 01

స్టాక్ మార్కెట్లు కాస్త నెమ్మదించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 675 పాయింట్ల లాభంతో 60,225 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్ల వృద్ధితో 17,820 వద్ద కొనసాగుతోంది.

12:49 February 01

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

  • భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
  • వెయ్యి పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్‌
  • 250 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ

12:32 February 01

పేదలపై వరాల జల్లు

చివరిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టిన భాజపా ప్రభుత్వం.. పేదలపై వరాల జల్లు కురిపించింది. వేతన జీవులు, నిరుద్యోగులతో పాటు సొంతింటి కల సాకారం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. రూ. 7 లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. పీఎం ఆవాస్​ యోజన పథకం కింద రూ. 79 వేల కోట్లను కేటాయించారు.

12:20 February 01

వేతనజీవులకు ఊరట

కేంద్ర బడ్జెట్​లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఉరట! లక్షలాది మందికి ప్రయోజనం కలిగేలా వ్యక్తిగత పన్ను రిబేట్ పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈమేరకు ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు మినహాయింపులు ఉపయోగించుకొని పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో, శ్లాబుల సంఖ్యను 5కు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో మినహాయింపుల కారణంగా ఏటా ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల ఆదాయం తగ్గనుందని నిర్మల వెల్లడించారు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్​గా అమలుకానుందని.. అయితే ఈ విధానాన్ని ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు.

  • కొత్త పన్ను విధానం ఇలా..
    • రూ.7లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
    • శ్లాబుల సంఖ్య 5కు తగ్గింపు. పన్ను మినహాయింపు పరిమితి రూ.3లక్షలకు పెంపు.
    • రూ.0-3 లక్షలు ఆదాయం.. ఎలాంటి పన్ను ఉండదు
    • రూ.3-6 లక్షలు ఆదాయం.. 5శాతం పన్ను
    • రూ.6-9 లక్షలు ఆదాయం.. 10 శాతం పన్ను
    • రూ.9-12 లక్షలు ఆదాయం.. 15శాతం పన్ను
    • రూ.12-15 లక్షలు ఆదాయం.. 20 శాతం పన్ను
    • రూ.15లక్షలపైన ఆదాయం.. 30శాతం పన్ను
  • ఎవరికి ఎంత పన్ను అంటే..?
    • రూ.9లక్షల వార్షిక వేతనం పొందుతున్న వ్యక్తులు ఇకపై చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు మాత్రమే. ప్రస్తుతం వీరు రూ.60వేలు చెల్లిస్తున్నారు.
    • రూ.15 లక్షల వార్షిక వేతనం పొందే వ్యక్తులు ఇదివరకు రూ.1.87 లక్షలు చెల్లిస్తుండగా.. ఇప్పుడు అది రూ.1.5 లక్షలకు తగ్గనుంది.
    • గరిష్ఠ సర్​ఛార్జి రేటు ప్రస్తుతం 37 శాతంగా ఉండగా.. దాన్ని 25 శాతానికి తగ్గించారు. ఫలితంగా ఓ వ్యక్తి.. ఇదివరకు చెల్లించే పన్ను 42.74 శాతం ఉంటే.. ఇప్పుడది 39 శాతానికి తగ్గనుంది.

12:14 February 01

దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్ల విడిభాగాలపై కస్టమ్స్‌ డ్యూటీ స్వల్పంగా తగ్గింపు

  • దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్ల విడిభాగాలపై కస్టమ్స్‌ డ్యూటీ స్వల్పంగా తగ్గింపు
  • ఎలక్ట్రిక్‌ కిచెన్‌ చిమ్నీ కాయల్‌, లిథియం అయాన్‌ బ్యాటరీలపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు
  • ముడి గ్లిజరిన్‌పై 5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు
  • రొయ్యల మేత తయారీ యూనిట్ల పరికరాలపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు
  • ఎంఎస్‌ఎంఈలకు వడ్డీ రేట్లలో ఒక శాతం తగ్గింపుతో రూ.2 లక్షల కోట్ల నిధులు
  • మహిళలు, బాలికల కోసం మహిళా సమ్మాన్ బచత్‌ పత్ర పథకం
  • 2025 వరకు అమల్లో మహిళా సమ్మాన్ బచత్‌ పత్ర పథకం
  • సీనియర్ సిటిజన్స్‌ డిపాజిట్‌ పథకం రూ.15 నుంచి రూ.30 లక్షలకు పెంపు
  • సిగరెట్లపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపు
  • ఎంఎస్‌ఎంఈలకు ముందస్తు పన్ను రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంపు

12:01 February 01

ఐటీ అభివృద్ధి కోసం 30 అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

  • కోస్తాలో మడ అడవుల అభివృద్ధికి మిస్టీ పేరుతో ప్రత్యేక పథకం
  • రాంసార్‌ చిత్తడి నేలలు, సరస్సుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
  • రాంసార్‌ ప్రాంతాల్లోని స్థానికులకు టూరిజం, ఉపాధి కల్పనలో ప్రాధాన్యం
  • నీతి ఆయోగ్‌ మరో మూడేళ్లు పొడిగింపు
  • అత్యాధునిక సాంకేతికత నేర్చుకోవడానికి యువతకు ప్రోత్సాహం
  • నాలుగో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
  • ఐటీ అభివృద్ధి కోసం 30 అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
  • దేశవ్యాప్తంగా పర్యాటక ప్రోత్సాహం కోసం 50 పర్యాటక ప్రాంతాలు గుర్తింపు
  • పోటీ పద్ధతిలో 50 పర్యాటక ప్రాంతాలు గుర్తింపు
  • మధ్యతరగతి ప్రజలు టూరిస్ట్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు దర్శన్‌ స్కీమ్‌
  • దేఖో అప్నా దేశ్‌ పేరిట మధ్యతరగతికి పర్యాటక పథకం

11:49 February 01

ఎంఎస్‌ఎంఈలకు ఊరట

  • 63 వేల సొసైటీల కంప్యూటరీకరణకు రూ.2,516 కోట్లు
  • 5జీ ప్రోత్సాహకానికి యాప్‌ల అభివృద్ధి కోసం వంద ల్యాబ్‌లు
  • లద్దాఖ్‌లో 13 గిగావాట్ల విద్యుదుత్పత్తికి రూ.20,700 కోట్లు పెట్టుబడులు
  • ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
  • ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి గోవర్దన్‌ స్కీమ్‌
  • నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ.19,700 కోట్లు
  • ఎంఎస్‌ఎంఈలకు ఊరట
  • కొవిడ్‌ కాలంలో పూర్తిచేయలేని పనులకు డిపాజిట్‌ చేసిన మొత్తం తిరిగి చెల్లింపు
  • ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్ల నిధులు
  • ఎంఎస్‌ఎంఈలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారసంస్థలకు డిజిలాకర్‌ సేవల విస్తరణ
  • కృత్రిమ వజ్రాల తయారీ, అభివృద్ధికి ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు

11:41 February 01

రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు

  • ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కోసం మిషన్‌ కర్మయోగి
  • రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
  • కృత్రిమ మేథ అభివృద్ధికి 3 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌లు ఏర్పాటు
  • సాగు, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల కోసం కృత్రిమ మేథ అభివృద్ధి
  • ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు
  • డిజిటల్‌ ఇండియాకు అనుగుణంగా వన్‌స్టాప్‌ ఐడెంటిటీ కేవైసీ విధానం

11:36 February 01

రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు

  • రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
  • రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు
  • రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు
  • 2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్లు నిధులు
  • కర్ణాటక సాగు రంగానికి రూ.5,300 కోట్లు సాయం
  • పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు
  • పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు
  • చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు
  • కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
  • మూలధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లు

11:31 February 01

గిరిజనుల కోసం పీఎం పీవీటీజీ మిషన్‌ ఏర్పాటు

  • ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం
  • సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు
  • చిట్టచివరి వ్యక్తి వరకు లబ్ధి చేకూరాలన్నదే రెండో లక్ష్యం
  • నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని ప్రోత్సహిస్తాం
  • గిరిజనుల కోసం పీఎం పీవీటీజీ మిషన్‌ ఏర్పాటు
  • ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం
  • మత్స్యరంగానికి రూ.6 వేలకోట్లు
  • 157 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం
  • ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రభావం వల్ల వృద్ధిరేటు మందగించింది

11:21 February 01

శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం

  • 7 ప్రాధాన్య అంశాలుగా ఈ బడ్జెట్‌
  • మొదటి ప్రాధాన్యత.. సమ్మిళిత వృద్ధి
  • ఆత్మనిర్భర క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ ప్రకటిస్తున్నాం
  • శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం
  • రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు అందిస్తాం
  • పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం
  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత పెంచుతాం
  • గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు
  • సహకారంతో సమృద్ధి విధానంలో రైతులకు ప్రోత్సాహం
  • వ్యవసాయ స్టార్టప్‌ల ప్రోత్సాహకానికి ప్రత్యేక నిధులు

11:16 February 01

2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాం

  • అమృత కాల విజన్‌పై వివరిస్తున్న ఆర్థిక మంత్రి
  • 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాం
  • ప్రపంచంలో అత్యధికంగా 7 శాతం వృద్ధిరేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ మనది
  • సామాజిక భద్రత, డిజిటల్‌ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించాం
  • సామాన్యుల సాధికారితకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది
  • హరిత అభివృద్ధి దిశగా అనేక విధానాలు రూపొందిస్తున్నాం

11:09 February 01

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌

  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌
  • తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపైంది
  • తొమ్మిదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాం
  • కొవిడ్ సమయంలోనూ ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాం
  • ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోంది
  • వంద కోట్లమందికి 220 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించాం
  • భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోంది

11:00 February 01

బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌

  • బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌
  • అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్‌
  • అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌
  • వృద్ధిరేటు ఏడు శాతం అంచనా వేస్తున్నాం

10:33 February 01

బడ్జెట్‌ను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం

  • ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
  • 2023-24 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
  • 11 గంటలకు లోకసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నిర్మల సీతారామన్
  • గత రెండేళ్లుగా పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
  • 2021 -22 నుంచి ట్యాబ్ లో చూసి బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్న ఆర్ధిక మంత్రి
  • ఎన్డీఏ ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరిసారి పూర్తి స్థాయి బడ్జెట్
  • సంక్షేమం, ప్రజాకర్షక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంచనాలు
  • పార్లమెంటు వద్దకు చేరుకున్న బడ్జెట్ పత్రాలు

10:07 February 01

పార్లమెంటుకు చేరుకున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

  • పార్లమెంటుకు చేరుకున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
  • కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం
  • బడ్జెట్‌ను ఆమోదించనున్న కేంద్ర మంత్రివర్గం
  • 11 గం.కు పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌

09:36 February 01

రాష్ట్రపతితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భేటీ

  • సహాయ మంత్రులు, సీనియర్ అధికారులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
  • బిడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్రపతికి వివరాలు అందించిన నిర్మలా సీతారామన్
  • కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రపతితో భేటీ
  • రాష్ట్రపతితో నిర్మల భేటీ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశం
  • కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

09:18 February 01

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

  • రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

  • నేడు పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
  • ఉదయం 11 గం.కు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌
  • 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
  • వరుసగా ఐదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌
  • ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌

09:05 February 01

Union Budget 2023 : బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. పార్లమెంటుకు చేరిన పద్దు పత్రాలు

Union Budget 2023 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అటు ఉరుముతున్న ఆర్థికమాంద్యం.. ఇటు తరుముకొస్తున్న ఎన్నికలు.. ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేయాలా? జనాకర్షణకు పట్టం కట్టాలా? కేంద్ర బడ్జెట్‌ వేళ మోదీ సర్కారు ముంగిట నిలిచిన అతిపెద్ద సవాళ్లు ఇవి. తరాజు ఎటువైపు ఎక్కువగా మొగ్గినా రెండో దానిపై తీవ్ర ప్రభావం తప్పదు. అత్యంత చాకచక్యంగా అడుగులేయాల్సిన తరుణమిది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎంత నిర్మాణాత్మకంగా ముందుకు వెళతారనే దానిని ఇప్పుడు యావద్దేశం ఆసక్తితో గమనిస్తోంది.

Last Updated : Feb 1, 2023, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.