ETV Bharat / sitara

జయా బచ్చన్, ఐశ్వర్యా రాయ్​కు కరోనా నెగటివ్

అమితాబ్
అమితాబ్
author img

By

Published : Jul 11, 2020, 10:55 PM IST

Updated : Jul 12, 2020, 2:03 PM IST

14:00 July 12

జయా బచ్చన్, ఐశ్వర్యారయ్​కి కరోనా నెగటివ్

అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్​లకు కరోనా పాజిటివ్​ రాగా వారి కుటుంబం మొత్తానికి పరీక్షలు నిర్వహించారు. తాజాగా జయా బచ్చన్​తో పాటు ఐశ్వర్యా రాయ్​కు నెగటివ్​ అని తేలింది.

10:08 July 12

అమితాబ్ నివాసం శానిటైజ్

  • Maharashtra: Sanitisation workers of the Brihanmumbai Municipal Corporation (BMC) arrive at 'Jalsa', the residence of actor Amitabh Bachchan in Mumbai.

    Actor Amitabh Bachchan and son Abhishek Bachchan tested #COVID19 positive and both have been admitted to a hospital. pic.twitter.com/X3KZ3nziwI

    — ANI (@ANI) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమితాబ్, అభిషేక్​కు కరోనా పాజిటివ్ రావడం వల్ల అప్రమత్తమయ్యారు ముంబయి కార్పోరేషన్ అధికారులు. వారి నివాసం 'జల్సా'ను పూర్తిగా శానిటైజ్ చేశారు.

07:35 July 12

నిలకడగా అమితాబ్​ ఆరోగ్యం..

కరోనా సోకిన అమితాబ్​ బచ్చన్​ ఆరోగ్యం నిలకడగా ఉందని ముంబయిలోని నానావతీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయనకు తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అమితాబ్​.. ఆసుపత్రి ఐసోలేషన్​ యూనిట్​లో ఉన్నట్లు వెల్లడించారు.  

02:27 July 12

మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి స్పందన...

అమితాబ్​, అభిషేక్​కు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్​ తోపే తెలిపారు. వారి కుటుంబ సభ్యులు జయా బచ్చన్​, ఐశ్వర్యరాయ్​ బచ్చన్​కూ పరీక్షలు నిర్వహించామని, వారి ఫలితాలు ఆదివారం ఉదయం వస్తాయని స్పష్టం చేశారు. 

00:15 July 12

  • Earlier today both my father and I tested positive for COVID 19. Both of us having mild symptoms have been admitted to hospital. We have informed all the required authorities and our family and staff are all being tested. I request all to stay calm and not panic. Thank you. 🙏🏽

    — Abhishek Bachchan (@juniorbachchan) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అభిషేక్​ బచ్చన్​కూ కరోనా..

తన తండ్రి అమితాబ్​తో పాటు తనకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు బాలీవుడ్ హీరో అభిషేక్​ బచ్చన్​ వెల్లడించాడు. ఇద్దరకీ స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఆసుపత్రిలో చేరినట్లు స్పష్టం చేశాడు. సంబంధిత అధికారులకు సమాచారమిచ్చి, తమ కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపాడు జూనియర్  బచ్చన్.  

ఎవరూ భయపడవద్దని, ప్రశాంతంగా ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు  అభిషేక్. 

00:09 July 12

  • Wishing you a speedy recovery @SrBachchan. The prayers and good wishes of the entire country are behind you. You have always been a fighter and will see this through too with your will power and resilience. Hope you get well really soon ❤️🙏🏻 https://t.co/39yqi3Mb0b

    — Yuvraj Singh (@YUVSTRONG12) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశమంతా మీ వెనక ఉంది..

అమితాబ్ కరోనా నుంచి వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మాజీ క్రికెటర్ యువరాజ్​ సింగ్ తెలిపారు. "దేశమంతా మీ వెనక ఉంది, మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తోంది. మీరు జీవితమంతా ఒక యోధుడిలా పోరాడారు. ఈ సమస్యను కూడా అదే సంకల్ప శక్తితో అధిగమిస్తారని భావిస్తున్నా" అని ట్వీట్ చేశాడు యువరాజ్​.

23:55 July 11

జాగ్రత్తగా ఉండండి- సచిన్​

అమితాబ్​ త్వరగా కోలుకోవాలని దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​ ఆకాంక్షించారు. జాగ్రత్త వహించాలని సూచించారు. 

23:53 July 11

  • Extremely saddened to hear the news of Shri #AmitabhBachchan Ji testing COVID Positive.
    Praying for his strength & speedy recovery. @SrBachchan please get well soon!

    — Mamata Banerjee (@MamataOfficial) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మమతా బెనర్జీ..

అమితాబ్​కు కరోనా పాజిటివ్ రావటం దిగ్భ్రాంతికి గురిచేసిందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఆయన త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 

23:48 July 11

త్వరగా కోలుకోవాలి: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

కరోనా నుంచి అమితాబ్​ త్వరగా కోలుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ ఆకాంక్షించారు. అమితాబ్​ సూపర్ స్టార్​ అని, కోట్ల మందిలో స్ఫూర్తి నింపారని అన్నారు. ప్రభుత్వం సాయంగా ఉంటుందని స్పష్టం చేశారు. 

22:52 July 11

బాలీవుడ్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​కు కరోనా పాజిటివ్​

  • T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
    All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !

    — Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ముంబయిలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. అమితాబ్​ కుటుంబంతో పాటు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఆయనతో గత 10 రోజులుగా సన్నిహితంగా ఉన్నవారిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అమితాబ్​ ట్విట్టర్​లో కోరారు.

Last Updated : Jul 12, 2020, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.