బిహార్ నలంద జిల్లాలో మొహం, జుట్టు అందంగా లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టు పక్కల వారు ఎగతాళి చేయడం వల్ల మనస్తాపానికి గురైన ఆ యువకుడు.. సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
ఎకంగర్సరయ్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీని కోసం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో చికిత్స సైతం పొందుతున్నాడు. అయితే, విజయ్.. మొహం, జట్టు అందంగా లేవని చుట్టుపక్కల వారు ఎగతాళి చేసేవారు. దీంతో వారి మాటలకు మనస్తాపానికి గురయ్యాడు విజయ్. ఇటీవలే తన సోదరి ఇంటికి వెళ్లిన అతడు.. మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత బెడ్రూంకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఉదయాన్నే సోదరి లేచి చూసేసరికి శవమై కనిపించాడు. ఆందోళనకు గురైన సోదరి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఇంటికి చేరుకున్న సోదరులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు వచ్చి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
"ముగ్గురు సోదరుల్లో విజయ్ చిన్నవాడు. అతడికి కొన్ని రోజులగా ఆరోగ్యం బాగాలేదు. దీంతో రాంచీలో చికిత్స పొందుతున్నాడు. నిద్రలేమి సమస్యతో కూడ బాధపడుతున్నాడు. ఇటీవలే సోదరి ఇంటికి వెళ్లాడు. అయితే, బుధవారం ఉదయం విజయ్ ఉరివేసుకుని చనిపోయాడని ఫోన్ వచ్చింది. వెంటనే వెళ్లి చూడగా.. అక్కడ సూసైడ్ నోట్ లభించింది. అందులో జుట్టు, మొహం అందంగా లేకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు."
--మృతుడి సోదరుడు
ప్రియురాలిని 12 సార్లు పొడిచిన ప్రియుడు
పెళ్లికి ఒప్పుకోవడం లేదనే కోపంతో ప్రియురాలిని 12 సార్లు కత్తితో పొడిచాడు ఓ ప్రియుడు. ఈ ఘటన బిహార్‌లోని సీతామఢీలో జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 7 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.
ఇదీ జరిగింది
హరిబోల్ గ్రామానికి చెందిన చందన్ కుమార్.. అదే గ్రామానికి చెందిన యువతి ఇద్దరు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల ఆ యువతి వివాహానికి నిరాకరించింది. దీంతో వీరద్దరూ కలిసి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు చందన్ కుమార్. దీనిపై యువతి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన చందన్.. బాధితురాలిపై 12 సార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ సమయంలోనే అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ రాజ్ కిశోర్ బాధితురాలిని గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి యువతి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. ఆమె కడుపులో 5 సార్లు, ఛాతీపై ఒకసారి సహా మొత్తం 12 సార్లు పొడిచాడని వివరించారు.
ఇవీ చదవండి : బాలికను కత్తితో పొడిచి, రాయితో కొట్టి హత్య.. నడిరోడ్డుపైనే బాయ్‌ఫ్రెండ్ దారుణం
విద్యార్థినిని కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్.. పెట్రోల్ పోసి నిప్పు.. 2నెలలుగా చికిత్స పొందుతూ..