ETV Bharat / bharat

Women Reservation In Lok Sabha : మహిళా రిజర్వేషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం - లోక్​సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు

Women Reservation In Lok Sabha : చిరకాలంగా ప్రతిపాదనల దశలోనే మగ్గిపోతున్న మహిళా రిజర్వేషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. 8 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లును ఆమోదించింది.

women reservation in lok sabha
women reservation in lok sabha
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 7:32 PM IST

Updated : Sep 20, 2023, 8:20 PM IST

Women Reservation In Lok Sabha : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. 8 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లుకు దిగువ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లురాగా వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణలు కూడా వీగిపోయాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ కూడా ఉండటం వల్ల ఈ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టారు. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజ్యసభ ఆమోదం కూడా లభిస్తే నియోజక వర్గాల డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తైన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి.

Womens Reservation Bill India : 2026 తర్వాతే డీలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. అది పూర్తయ్యి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొన్నేళ్లు పట్టడం ఖాయం. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావు. 2029లోనే పార్లమెంటు ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశముంది. 2026 తర్వాత డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసే అవకాశముంది.

గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు చాలాసార్లు పార్లమెంట్‌ ముందుకు వచ్చింది. ప్రతిసారీ ఏకాభిప్రాయం కుదరక ఆమోదం పొందలేదు. 2010లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించినా లోక్‌సభ పచ్చజెండా ఊపలేదు. దాదాపు 27ఏళ్లుగా ఇది పెండింగ్‌లోనే ఉంది. ఈసారి మహిళా రిజర్వేషన్లకు దాదాపు పార్టీలన్నీ మద్దతుగా నిలవడంతో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది

'మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్షాలు రాజకీయం'
అంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. మహిళా సాధికారత అనేది ప్రతిపక్షాలకు రాజకీయ ఎజెండా కావొచ్చేమో గానీ.. భాజపాకు కాదని అన్నారు.ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించి వెంటనే మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రక్రియను ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. విపక్షాలన్నీ ఈ బిల్లును ఏకగ్రీవంగా మద్దతు తెలిపాలని కోరారు. బిల్లులో ఏమైనా లోపాలుంటే తర్వాత సరిదిద్దుకోవచ్చని చెప్పారు. ఈ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందిన తర్వాత.. ఉభయ పార్లమెంటు సభలు, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ అవుతాయని... దీంతో మహిళల హక్కుల కోసం సుదీర్ఘంగా జరుగుతున్న పోరాటానికి తెరపడనుందని తెలిపారు.

  • #WATCH | "...This is the fifth attempt to bring the Women's quota bill. From Devegowda ji to Manmohan Singh ji, four attempts were made to bring this bill...what was the reason this bill was not passed?..." says Union Home Minister Amit Shah in Lok Sabha on Women's Reservation… pic.twitter.com/6ckEMVjKK6

    — ANI (@ANI) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Union Home Minister Amit Shah in Lok Sabha on Women's Reservation Bill

    "...For some parties, women empowerment can be a political agenda and a political tool to win elections, but for BJP & Narendra Modi it is not a political issue..." pic.twitter.com/XCOCVtRebS

ఓబీసీ కోటా కల్పించలేదని రాహుల్ మండిపాటు
మరోవైపు మహిళా బిల్లుపై మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. కానీ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని.. వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. పార్లమెంట్ పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మారినప్పుడు రాష్ట్రపతిని ఆహ్వానించి ఉండాల్సిందన్నారు. కుల గణన సైతం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

Rahul Gandhi Vs Amit Shah On OBCs : రాహుల్​ వర్సెస్ షా.. ఓబీసీలకు ప్రాధాన్యంపై డైలాగ్ వార్

Sonia Gandhi Parliament Speech Today : 'మహిళా రిజర్వేషన్లు రాజీవ్ కల.. వెంటనే అమలు చేయండి.. ఆలస్యమైతే అన్యాయమే!'

Last Updated : Sep 20, 2023, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.