ETV Bharat / bharat

సర్కార్​ నయా రూల్​.. కాలేజీల్లో అడ్మిషన్లకు ఓటరు నమోదు తప్పనిసరి! - మహారాష్ట్ర ోట

కళాశాలల్లో ప్రవేశాల కోసం 18 ఏళ్లుపైబడిన విద్యార్థులందరికీ ఓటరు నమోదును తప్పనిసరి చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు వచ్చే ఏడాది జూన్ నుంచి జాతీయ విద్యావిధానం కింద రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది.

voter-registration-is-mandatory-for-students-above-18-years-for-college-admissions

author img

By

Published : Nov 26, 2022, 6:32 AM IST

కళాశాలల్లో ప్రవేశాల కోసం 18 ఏళ్లుపైబడిన విద్యార్థులందరికీ ఓటరు నమోదును తప్పనిసరి చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు వచ్చే ఏడాది జూన్ నుంచి జాతీయ విద్యావిధానం కింద రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన విశ్వవిద్యాలయాల వైస్‌- ఛాన్స్‌లర్ల సమావేశంలో రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

'రాష్ట్ర ఉన్నత విద్యావ్యవస్థలోని 50 లక్షల మంది విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. కేవలం 32 లక్షల మంది మాత్రమే ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు తమ ఓటరు నమోదును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని జారీ చేయనుంది' అని మంత్రి తెలిపారు. విద్యాసంస్థలు సైతం ఓటరు నమోదు శాతాన్ని మెరుగుపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

'ఎన్‌ఈపీ అమలులో భాగంగా వచ్చే ఏడాది జూన్‌ నుంచి విశ్వవిద్యాలయాలు నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాలి. లేని పక్షంలో చర్యలు తీసుకుంటాం' అని మంత్రి హెచ్చరించారు. ఎన్‌ఈపీ అమలుపై అనుమానాలు, సందేహాల పరిష్కారానికి ప్రభుత్వం త్వరలో రిటైర్డ్ వైస్ ఛాన్స్‌లర్ల కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని సాధించేందుకుగానూ విశ్వవిద్యాలయాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.