up gangster daughter murder: ఉత్తర్ప్రదేశ్ చందౌలీలో గ్యాంగ్స్టర్ ఇంట్లో పోలీసుల రైడ్ తర్వాత అతడి కుమార్తె శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తూ మన్రాజ్పుర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ కన్నయ్య యాదవ్ చిన్న కుమార్తె తీవ్రంగా గాయపడిందన్నారు. కన్నయ్య ఇంటి వద్ద కొందరు గ్రామస్థులు చేపట్టిన నిరసనలకు సమాజ్వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.


"గ్యాంగ్స్టర్ కన్నయ్య యాదవ్ కుమార్తె నిషా.. తన ఇంట్లో శవమై కనిపించింది. ఆమెను సయ్యద్రజా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కొట్టారన్నది ఆరోపణ. ఆ ఎస్హెచ్ఓను సస్పెండ్ చేశాం. మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందాక కేసు నమోదు చేస్తాం. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించాం. "
-వారణాసి జిల్లా మేజిస్ట్రేట్, సంజీవ్ సింగ్
ఇదీ చదవండి: అమానవీయం.. స్నేహితులతో కలిసి సొంత కుమార్తెపైనే..