ETV Bharat / bharat

భూమి కోసం ఒకరు.. భాష కోసం మరొకరు.. ఇద్దరు వృద్ధుల వినూత్న నిరసన - ఇద్దరు వృద్ధుల వినూత్న నిరసన

ఇద్దరు వృద్ధులు చేస్తున్న వినూత్న నిరసనలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓ వృద్ధుడు అధికారిక భాష కోసం 15 ఏళ్లుగా పోరాటం చేస్తుండగా.. మరొకరు తన భూమి కోసం చేస్తున్నారు.

oldage people unique protest
నిరసన తెలుపుతున్న నంద్​కుమార్​ శుక్లా
author img

By

Published : Jul 22, 2022, 6:32 PM IST

కబ్జాకు గురైన తన భూమిని తిరిగి అప్పగించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చూట్టూ తిరిగి విసుగెత్తిన ఓ వృద్ధుడు వినూత్నంగా నిరసన చేపట్టారు. భూమికి సంబంధించిన మ్యాప్​ను చొక్కాపై ముద్రించుకుని కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మరొకరు ఛత్తీస్​గఢీ భాషకు అధికారిక హోదా దక్కాలంటూ 15 ఏళ్లగా పోరాటం చేస్తున్నారు. కర్ర, టోపీ ధరించి.. చొక్కాపై ఛత్తీస్​గఢీ అని రాసుకొని నిరసన తెలుపుతున్నారు.

బిలాస్​పుర్​ జిల్లా కేంద్రానికి సమీపంలోని బిర్​కోనా గ్రామానికి చెందిన 80 ఏళ్ల లాటెల్​రామ్​ యాదవ్​కు రెండు ఎకరాల భూమి ఉంది. కొందరు కబ్జాదారులు ఆ భూమిపై కన్నేశారు. ప్రభుత్వ అధికారులతో చేతులు కలిపి.. లాటెల్​రామ్​ భూమిని కబ్జా చేశారు. దీనిపై అనేక సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన లాటెల్​రామ్​కు విసుగు వచ్చింది. దీంతో సమస్య పరిష్కరానికి వినూత్నంగా నిరసన చేపట్టాలని అనుకున్నాడు. కబ్జాకు గురైన భూమికి సంబంధించిన మ్యాప్​ను దుస్తులపై ముద్రించుకుని నిరసన చేపట్టారు. కబ్జాకు గురైన తన భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

భూమికోసం ఒకరు.. భాష కోసం మరోకరు.. ఇద్దరు వృద్ధుల వినూత్న నిరసన
oldage people unique protest
నిరసన తెలుపుతున్న నంద్​కుమార్​ శుక్లా

మరో వృద్ధుడు సైతం ఇదే తరహాలో నిరసన చేపట్టారు. ఛత్తీస్​గఢీ భాషకు అధికారిక హోదా కల్పించాలని కోరుతూ 15 ఏళ్లగా పోరాటం చేస్తున్నారు. బిలాస్​పుర్​కు చెందిన నంద్​కుమార్​ శుక్లా.. చొక్కాపై ఛత్తీస్​గఢీ అని ముద్రించుకుని నిరసన చేపట్టారు. టోపీ ధరించి.. చేతిలో కర్ర పట్టుకుని.. అధికారిక భాష హోదా కోసం నినాదాలు చేస్తున్నారు.

oldage people unique protest
నిరసన తెలుపుతున్న నంద్​కుమార్​ శుక్లా

"ప్రభుత్వ పాఠశాలల్లో ఛత్తీస్​గఢీ మాధ్యమం లేదు. హిందీతో కలిపే ఛత్తీస్​గఢీ బోధిస్తున్నారు. ఉపాధ్యాయులు అందరూ మొదట హిందీలో చదివి.. ఆపై ఛత్తీస్​గఢీలోకి అనువదిస్తున్నారు. నేరుగా ఛత్తీస్​గఢీలో బోధించడంలేదు."

-నంద్​కుమార్​ శుక్లా

ఇవీ చదవండి: జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం క్లారిటీ.. త్వరలోనే...

అంబానీ కుటుంబ భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.