TTD Varalakshmi Vratham Tickets : శ్రావణ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో మహిళలు నోచే నోము 'వరలక్ష్మీ వ్రతం'. ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు పెళ్లయిన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే భర్త, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయుష్షు బాగుంటాయని ఓ విశ్వాసం. మరి ఇంతటి పర్వదినాన్ని తిరుమల శ్రీవారి సన్నిధిలో జరుపుకుంటే ఎంతో మహాభాగ్యం కలుగుతుందని చాలామంది మహిళలు భావిస్తారు. దాంతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతంలో మహిళలు వర్చువల్‌గా లేదా నేరుగా పాల్గొనే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devastanam) కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి వర్చువల్ టికెట్లు విడుదల కాగా.. తాజాగా వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే 150 టికెట్లను విడుదల చేసింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
TTD Varalakshmi Vratham Tickets in Online : ఈ నెల 25న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం(Varalaxmi Vratham) వైభంగా జరగనుంది. ఇందుకు సంబంధించి తితిదే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. ఆలయంలోని ఆస్థాన మండపంలో ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ వ్రతం జరగనుంది. ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
Varalakshmi Vratham at Tirumala : ఈనెల 25(శుక్రవారం) నాడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి అభిషేకం, వస్త్రాలంకరణ సేవ, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం సేవలను రద్దు చేసినట్లు తితిదే(TTD) తెలిపింది. ఆన్లైన్లో టికెట్లు పొందలేకపోయిన వారికోసం మరో సదుపాయాన్ని తితిదే కల్పిస్తోంది. ఈనెల 24న ఆలయం దగ్గరలో కుంకుమార్చన కౌంటర్లో ఆ రోజు ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్ ద్వారా 150 టికెట్లు విక్రయించనున్నట్లు పేర్కొంది. వీటి కోసం భక్తులు రూ.1000 చెల్లించి టికెట్ పొందవచ్చని తితిదే తెలిపింది. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.
వరలక్ష్మీ వ్రతంతో సకల ఐశ్వర్యాలు..
TTD Good News to Devotees : తితిదే భక్తులకు మరో అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రతిరోజు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే అమ్మవారి కల్యాణోత్సవంలోనూ భక్తులు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఇస్తోంది. అలాగే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్(Sri Venkateshwara Bhakthi Channel) ప్రత్యక్షప్రసారం ద్వారా భక్తులు వర్చువల్‌గా పాల్గొనేందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకు టీటీడీ ఈ టికెట్లను అందుబాటులో ఉంచింది. 500 రూపాయలు చెల్లించి భక్తులు ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. అయితే వర్చువల్ టికెట్లు పొందిన భక్తులు మాత్రం టికెట్టు పొందిన తేదీ నుంచి 90 రోజులలోపు అమ్మవారి దర్శనాన్ని చేసుకునే వీలును తితిదే కల్పించింది. వర్చువల్ టికెట్ పొందిన భక్తులకు ఒక రవిక, లడ్డూ, వడ, ఉత్తరీయం బహుమానంగా అందిస్తారు. సుదూర ప్రాంత వాసులను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వర్చువల్ కల్యాణోత్సవాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పద్మావతి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తితిదే కోరుతోంది.
TTD Good News : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. డిసెంబర్ తర్వాత మరో లోకంలోకి భక్తులు!
మీకు ఇది తెలుసా..? TSRTC టికెట్‌తో సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం..