ETV Bharat / bharat

TTD Navaratri Brahmotsavam in Tirumala : తిరుపతి వెళ్తున్నారా..? ఈ విషయం తెలుసా? లేదంటే ఇబ్బందులు ఖాయం! - తిరుపతిలో ప్రత్యేక దర్శనాలు రద్దు

TTD Cancels Privileged Darshans for Navaratri Brahmotsavams in Tirumala : దసరా నవరాత్రి ఉత్సవాల వేళ తిరుమల వెళ్తున్నారా..? మరి, ఈ విషయాలు మీకు తెలుసా..? టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి తెలుసుకొని వెళ్లండి. లేదంటే.. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు పడతారు.

TTD cancels privileged darshans for Navaratri Brahmotsavams in Tirumala
TTD Navaratri Brahmotsavam in Tirumala
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 10:42 AM IST

TTD Cancels Privileged Darshans for Navaratri Brahmotsavams in Tirumala : తిరుమల క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా భావిస్తుంటారు భక్తులు. ఆ స్వామి వారిని కనులారా దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది ఏడు కొండలు ఎక్కుతుంటారు. ఇప్పుడు దసరా నవరాత్రుల సమయం కావడంతో.. భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..

Navaratri Brahmotsavams in Tirumala : తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబరు 15 నుంచి 23 వరకు వేంకటేశ్వర స్వామి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 19న గరుడ వాహన సేవ, అక్టోబర్ 20న పుష్పక విమానం, అక్టోబర్ 22న స్వర్ణరథం, అక్టోబర్ 23వ తేదీన చక్రస్నాన మహోత్సవం వంటి ఎన్నో విశిష్ట కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక, వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

Leopard Trapped in Cage Tirumala : తిరుమలలో ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత

ప్రత్యేక దర్శనాలు రద్దు..

TTD Cancels Privileged Darshans for Navaratri Brahmotsavams : దసరా నవరాత్రి ఉత్సవాల వేళ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా.. పలు ప్రత్యేక దర్శనాలన రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు చేస్తున్నారు. ఇంకా.. ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది, సీనియర్ సిటిజన్‌, శారీరక వికలాంగుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

పలు సేవలూ రద్దు..

ప్రత్యేక దర్శనాలతోపాటు పలు సేవలు కూడా రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల వేళ ధ్వజారోహణం, ధ్వజావరోహణం కార్యక్రమాలు నిర్వహించట్లేదని తెలిపారు. ఇంకా.. అష్టదళ పద్మారాధన, ఊంజల్ సేవ, తిరుప్పావడ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు వంటి ఆర్జిత సేవలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. భక్తుల భద్రత దృష్ట్యా అక్టోబరు 19న నిర్వహించే గరుడ సేవ వాహనానికి ముందు జంట ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించారు.

IRCTC Hyderabad to Tirupati Tour : హైదరాబాద్ To తిరుపతి.. హ్యాపీగా శ్రీనివాసుడి దర్శనం.. టికెట్ ఎంతో తెలుసా?

స్వామివారి గరుడ వాహన సేవను తిలకించాలని భక్తులు ఎంతగానో ఆశిస్తారు. ఈ నేపథ్యంలో నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల భక్తుల కోసం అక్టోబర్ 19న వాహన సేవను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం.. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులతో సంప్రదించాలని యోచిస్తున్నట్టు చెప్పారు.

తిరుమలలో బ్రహ్మోత్సవాలు సజావుగా, ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. యాత్రికులందరికీ శ్రీవారి దర్శనం సాఫీగా జరిగేలా చూసేందుకు టీటీడీ కట్టుబడి ఉందని, అందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని ధర్మారెడ్డి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో దిగ్విజయంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.

TTD LATEST NEWS: తిరుమల నడకదారుల్లో ప్రతి భక్తుడి చేతికి కర్ర… కరుణా 'కర్ర' రెడ్డి చారిత్రాత్మక వింత నిర్ణయం

ఇక తిరుమల గురించి సమస్త సమాచారం ఈ యాప్​లోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.