ETV Bharat / bharat

మూడేళ్ల బాలుడిపై 15 కుక్కలు దాడి.. శరీర భాగాలను వేరు చేసి..

కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఒకేసారి 15 శునకాలు బాలుడిపై దాడి చేసి శరీర భాగాలను వేరు చేశాయి. మరో ఘటనలో.. నవజాత శిశివును ఆస్పత్రి నుంచి కుక్క ఎత్తుకెళ్లిపోయి చంపేసింది. హృదయవిదారకమైన ఈఘటనలు ఎక్కడ జరిగాయంటే?

three-year-old-kid-killed-in-dog-attack
మూడేళ్ల బాలుడిపై 15కుక్కులు దాడి.. శరీర భాగాలను వేరు చేసి..
author img

By

Published : Jun 28, 2022, 1:29 PM IST

ఓ బాలుడిని కుక్కలు దారుణంగా చంపేశాయి. 15 శునకాలు ఒకేసారి దాడి చేసి శరీర భాగాలను వేరు చేశాయి. ఈ ఘటన మహారాష్ట్ర సతారాలోని జగ్‌తప్ వస్తీలో జరిగింది.
ఇదీ జరిగింది..
తల్లి ఇంటి దగ్గర్లలోని పొలంలో పని చేస్తుండగా.. మూడేళ్ల వయసు ఉన్న రాజ్‌వీర్ రాహుల్ హౌవల్ కొంచెం దూరంగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో 15 శునకాలు ఒకేసారి రాజ్‌వీర్​పై దాడి చేశాయి. అతని అవయవాలను దారుణంగా వేరు చేశాయి. కాసేపటి తర్వాత తల్లి.. రాజ్‌వీర్‌ కోసం వెతకగా అతడు కనిపించలేదు. చివరకు ఇంటికి సమీపంలోని పొలంలో రాజ్‌వీర్ మృతదేహం కనిపించింది. అతడి శరీరాన్ని కుక్కలు ఛిద్రం చేశాయి. ఆ దృశ్యాన్ని చూసిన తల్లి గుండెలు పగిలాయి. బోరున విలపించింది.

three-year-old-kid-killed-in-dog-attack
కుక్కల దాడిలో చనిపోయిన రాజ్‌వీర్

హరియాణాలో మరో చిన్నారి..
హరియాణాలోని పానిపత్​లో సైతం ఓ నవజాత శిశువు కుక్క కారణంగా ప్రాణాలు కోల్పోయింది. సెక్టార్ 13-17 పోలీస్ స్టేషన్ ఏరియాలోని ఆర్ట్ అండ్ మదర్ కేర్ హాస్పిటల్​లో మహమ్మద్ భార్య షబ్నమ్ జూన్ 25న డెలివరీ కోసం చేరింది. అదే రోజు రాత్రి 8.15 గంటలకు షబ్నమ్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత.. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న జనరల్ వార్డులోకి షబ్నమ్​ను మార్చారు.

సోమవారం మధ్యాహ్నం బంధువులతోపాటు తల్లి నిద్రపోతున్న సమయంలో.. శిశువును కుక్క నోట కరుచుకొని ఎత్తుకెళ్లింది. కొద్దిసేపటికి మెలకువ వచ్చి చూడగా.. చిన్నారి కనపడ లేదు. దీంతో బంధువులు ఆస్పత్రి బయటకు వెళ్లి చూశారు. నవజాత శిశువు కుక్క నోటిలో ఉంది.

అనంతరం ఆ శిశువును ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యులు పరీక్షించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. కుక్క మధ్యాహ్నం 2.07 గంటల సమయంలో చిన్నారిని కుక్క ఎత్తుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అయితే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగందంటూ.. చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: 'గుప్తనిధుల కోసమే 9 హత్యలు.. ఆ ఫ్యామిలీది ఆత్మహత్య కాదు.. విషమిచ్చి...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.