ETV Bharat / bharat

jeevitham foundation: వందలాది అభాగ్యులకు 24ఏళ్ల యువతే 'అమ్మ' - జీవితం ఫౌండేషన్ ఈరోడ్

అనాథలు, కుటుంబసభ్యులు వద్దని వదిలేసిన వారికి, ఏ ఆధారం లేక... రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్న వారికి.. కొత్త జీవితం ప్రసాదిస్తోంది ఓ 24ఏళ్ల అమ్మాయి(jeevitham foundation). అంతే కాక వారు సొంత కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దుతోంది. తనే తమిళనాడుకు చెందిన మనీషా కృష్ణస్వామి.

jeevitham foundation
జీవితం ఫౌండేషన్
author img

By

Published : Aug 31, 2021, 6:36 AM IST

అనాథలు, అభాగ్యులను చేరదీస్తున్న జీవితం ఫౌండేషన్

రోడ్లపై ఎవరైనా చిరిగిన బట్టలతో, మాసిన జుత్తుతో కనిపిస్తే.. పక్కకు తప్పుకొని వెళ్లిపోతాం. వారిని చూసి చీదరించుకునేవారూ ఉన్నారు. ఇంకొందరు మంచి మనసుతో.. చేతనైతే పదో పాతికో సాయం చేసేవాళ్లుంటారు. అలాంటిది ఏ దిక్కూ లేని వారి గురించి అనునిత్యం ఆలోచిస్తూ వారి గురించి పరితపిస్తోంది.. ఓ 24 ఏళ్ల అమ్మాయి. వారికి ఆశ్రయం కల్పించి అండగా నిలుస్తోంది. తమ కాళ్లపై తాము నిలబడే విధంగా తీర్చిదిద్దుతోంది. ఆమె.. తమిళనాడు ఈరోడ్​కు చెందిన మనీషా కృష్ణస్వామి.

jeevitham foundation
దీనుడితో మాట్లాడుతున్న మనీషా

మధ్యతరగతిలో జన్మించినా..

మనీషా దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తి కనబర్చేది. ఎక్కువగా.. రోడ్లపై జీవించే వాళ్లకు పండ్లు, ఆహారం, దుప్పట్లు వంటివి పంపిణీ చేసేది. క్రమంగా.. వయసుతో పాటు తన సేవాదృక్పథం పెరుగుతూ వచ్చింది. పదవ తరగతి పూర్తవగానే... పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ... అందులో సంపాందించిన డబ్బులో కొంత వీరి కోసం ఖర్చు చేసేది.

jeevitham foundation
జీవితం ఫౌండేషన్​లో ఆశ్రయం పొందుతున్నవారితో మనీషా

వివక్షను ఎదుర్కొని..

చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలనేది మనీషా కోరిక. స్తోమత లేకపోవడం వల్ల... ఆశయాన్ని వదులుకుంది. కానీ వైద్యరంగంపై ఆసక్తితో... నర్సింగ్‌ పూర్తి చేసింది. ఆశలు, ఆశయాలు ఎలా ఉన్నా.. రోడ్లపై జీవించే అభాగ్యుల కష్టాలు తీర్చాలనే కోరికతో ఓ ఎన్​జీఓలో చేరింది. అయితే అమ్మాయి కావడం వల్ల 'క్షేత్రస్థాయిలో నువ్వు సేవలేం చేస్తావు.. ఆఫీస్‌లో కూర్చొని పేపర్‌ పనులు చూసుకో' అని వివక్ష చూపించారు. ఈ నేపథ్యంలో.. ఆ ఎన్​జీఓకు వీడ్కోలు పలికి.. సొంతంగా "జీవితం" అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది(jeevitham foundation).

jeevitham foundation
అనాథకు అన్నం పెడుతూ

పునరావాసం..

వీధుల్లో నివసించే వారి దగ్గరికి వెళ్లి.. 'ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. అందుకు కారణాలేంట'ని అడిగి తెలుసుకుంటోంది మనీషా. సాధారణంగా వారు ఉంటున్న ప్రాంతం అంత త్వరగా వదిలి రారు. అప్పటి వరకు.. ఈ సంస్థ సభ్యులే.. వారికి స్నానం చేయించడం, కొత్త దుస్తులు కొనివ్వడం, మందులు ఇవ్వడం చేస్తుంటారు. ఆ క్రమంలో... వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి... ఇంటికి తీసుకు వెళ్లేలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కాదంటే.. వారిని పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు.

jeevitham foundation
అభాగ్యుల ఆటపాటలు

కరోనా కారణంగా ప్రభుత్వ పునరావాస కేంద్రాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకేసింది మనీషా. దాతలతో కలిసి తానే ఓ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. అందులో మంచి వసతితో పాటు ఆరోగ్యకర ఆహారం అందిస్తోంది. యోగా వంటివి నేర్పిస్తోంది. ఫలితంగా... అక్కడున్న వారే క్రమంగా తమ పని తాము చేసుకోవడం ప్రారంభించారు.

jeevitham foundation
యోగా నేర్పిస్తూ

కొత్త జీవితం.

పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికీ... వంట చేయడం, బట్టలు కుట్టడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తోంది. తద్వారా.. అందులో నైపుణ్యం సాధించిన వారు.. కొత్త జీవితం ప్రారంభించగలుగుతున్నారు. ఇప్పటి వరకు 350 మందిని పునరావాస కేంద్రాలకు పంపిస్తే.. వారిలో 50మందికిపైగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

jeevitham foundation
మనీషా సేవకు గుర్తింపు

ఇదీ చూడండి: సోనూసూద్ గొప్ప మనసు.. ఉచితంగా న్యాయ విద్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.