ETV Bharat / bharat

ఏడోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణం - నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

nitish
నితీశ్
author img

By

Published : Nov 16, 2020, 4:25 PM IST

Updated : Nov 16, 2020, 6:32 PM IST

18:14 November 16

బిహార్​లో కొలువుదీరిన నితీశ్ ప్రభుత్వం..

బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్​డీఏ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ ఏడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ఫాగు చౌహాన్‌.. నితీశ్​తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఎన్​డీఏకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు.  

ప్రజానిర్ణయంతోనే..

ప్రజా నిర్ణయంతోనే ఎన్​డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని నితీశ్ వ్యాఖ్యానించారు. తామంతా కలిసి బిహార్ ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా సుశీల్​ మోదీని నియమించకపోవటం.. భాజపా నిర్ణయమేనని నితీశ్ స్పష్టం చేశారు.  

నితీశ్ అరుదైన రికార్డులు..

నితీశ్ కుమార్‌ గత 20 ఏళ్లలో 7సార్లు సీఎంగా ప్రమాణం చేసి దేశ రాజకీయాల్లోనే అరుదైన అధ్యాయం లిఖించారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకుండానే ఏడుసార్లు ముఖ్యమంత్రి అయిన నేతగానూ ఘనత సాధించారు.

కేబినెట్ మంత్రులు..

నితీశ్‌తోపాటు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో భాజపాకు చెందిన తార కిశోర్‌ ప్రసాద్‌, సీనియర్‌ నాయకురాలు రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. తార కిశోర్‌ ప్రసాద్‌ ఇప్పటికే భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికవగా.... రేణుదేవి భాజపా తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

  • నితీశ్ మంత్రివర్గంలో జేడీయూ తరపున విజేంద్ర యాదవ్‌, విజయ్‌ చౌదరి, అశోక్‌ చౌదరి, మేవాలాల్‌ చౌదరి, శీలా మండల్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.
  • భాజపా నేతలు మంగళ్‌ పాండే, అమరేంద్ర ప్రతాప్‌ సింగ్‌, రాంప్రీత్‌ పాసవాన్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
  • కూటమిలో ఉన్న హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా నుంచి సంతోష్‌ మాంఝీ, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ నుంచి ముకేశ్ సాహ్నీలకు నితీశ్‌ మంత్రివర్గంలో చోటు దక్కింది.

మోదీ శుభాకాంక్షలు..

బిహార్​ సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్​కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ అభివృద్ధి కోసం ఎన్​డీఏ కుటుంబం కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర సంక్షేమం కోసం కేంద్రం నుంచి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.  

ఆర్​జేడీ గైర్హాజరు..

ఈ ప్రమాణస్వీకారానికి ప్రతిపక్ష ఆర్​జేడీ నేతలు హాజరుకాలేదు. ప్రజాతీర్పును ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రభావితం చేసినట్లు ఆరోపించింది.

17:02 November 16

  • Patna: JDU leaders Vijay Kumar Choudhary, Vijendra Prasad Yadav, Ashok Choudhary, and Mewa Lal Choudhary take oath as Cabinet Ministers of Bihar. pic.twitter.com/peFgFjM8vq

    — ANI (@ANI) November 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేబినెట్ మంత్రులుగా..

  • బిహార్ కేబినెట్ మంత్రులుగా జేడీయూ నేతలు విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవా లాల్ చౌదరి ప్రమాణం చేశారు.
  • హిందుస్థానీ అవామ్ మోర్చా చీఫ్ జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్​, వికాస్​శీల్ ఇన్సాన్ పార్టీ చెందిన ముకేశ్ సాహ్ని కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
  • భాజపా నేతలు మంగళ్ పాండే, అమరేంద్ర ప్రతాప్ సింగ్ కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

16:46 November 16

డిప్యూటీలుగా తార, రేణుదేవీ..

బిహార్​ ఉపముఖ్యమంత్రులుగా భాజపా నేతలు తార కిశోర్​ ప్రసాద్​, రేణుదేవీ ప్రమాణ స్వీకారం చేశారు.  

16:39 November 16

ప్రమాణ స్వీకారం..

బిహార్​లో ఎన్​డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. గవర్నర్​ ఫాగు చౌహాన్​ సమక్షంలో ముఖ్యమంత్రిగా ఏడోసారి నితీశ్ కుమార్​ ప్రమాణ స్వీకారం చేశారు. 

16:29 November 16

రాజ్​భవన్​కు నితీశ్..

బిహార్​కు కాబోయే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పట్నాలోని రాజ్​భవన్​కు ​ చేరుకున్నారు.  

16:11 November 16

నితీశ్ ప్రమాణ స్వీకారం

  • Bihar: Chief Minister designate Nitish Kumar arrives at Raj Bhavan in Patna.

    He will take oath as the CM of Bihar for the seventh time today. pic.twitter.com/agZngpg6js

బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా ఏడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు నితీశ్. ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.

పట్నాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​.. ఇప్పటికే బిహార్​ చేరుకున్నారు.  

ఇద్దరు డిప్యూటీలు..

బిహార్​లో​ ఈసారి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే వారిద్దరూ భాజపా నుంచే ఉండనున్నట్లు తెలుస్తోంది. నితీశ్‌ కుమార్​తో పాటే వారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఆ పార్టీ ఎమ్మెల్యేలు తారకిశోర్, రేణుదేవీలను ఈ పదవులకు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.  

ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చినట్లు తార కిశోర్ తెలిపారు. బిహార్​ ఉప ముఖ్యమంత్రులగా తామిద్దరం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. మహిళా శక్తి సాధనలో ఇదో గొప్ప ముందడుగు అని తెలిపారు. బిహార్ అభివృద్ధి కోసం తమకు అప్పగించిన పెద్ద బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని అన్నారు.

స్పీకర్​ కూడా భాజపాకే..

బిహార్ అసెంబ్లీ స్పీకర్​గా తమ పార్టీకి చెందిన నాయకుడే ఉంటారని భాజపా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నితీశ్‌ కుమార్‌, భాజపా అగ్రనేతల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్‌ కుమార్‌ మోదీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Last Updated : Nov 16, 2020, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.