ETV Bharat / bharat

కుమార్తె మర్డర్​.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య.. తల్లికి క్యాన్సర్​.. ప్రేమ హత్య కేసులో విషాదం

తన ప్రేమను తిరస్కరించిందని ఓ యువతిని రైలు కింద పడేసిన ఘటనలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కుమార్తె మరణవార్తను తట్టుకోలేక మృతురాలి తండ్రి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె తల్లి కూడా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందని పోలీసులు తెలిపారు.

student pushed in front of train
యువతిని రైలు కిందకు తోసేసిన యువకుడు
author img

By

Published : Oct 14, 2022, 8:00 PM IST

తన ప్రేమను తిరస్కరించిందని యువతిని రైలు కింద తోసేసిన ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కుమార్తె మరణ వార్త విని మృతురాలి తండ్రి మాణిక్యం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తల్లి రామలక్ష్మి.. క్యాన్సర్​తో బాధపడుతోంది. ఆమె మహిళా కానిస్టేబుల్​గా ఆదంబాక్కం పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తోంది. అయితే ప్రస్తుతం అనారోగ్యం కారణంగా లీవ్​లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తె సత్య మరణంతో ఆ కుటుంబం మరింత విషాదంలో మునిగిపోయింది.

నిందితుడు సతీశ్​ను పోలీసులు శుక్రవారం వేకువజామున తొరైపాక్కం సమీపంలో అరెస్టు చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్.. స్వయంగా మృతురాలు సత్య ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న ఆమె తల్లి రామలక్ష్మిని పరామర్శించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని ఆమెకు తెలిపారు.

ఇదీ జరిగింది..
చెన్నై గిండి సమీప ఆదంబాక్కానికి చెందిన మాణిక్యం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఇతని కుమార్తె సత్య(20) టీనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం రెండో ఏడాది చదువుతోంది. స్థానికంగా ఉంటున్న సతీశ్‌(23) ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలిపినా అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గురువారం కళాశాలకు వెళ్లేందుకు సత్య ..సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై నిల్చుని ఉండగా సతీశ్‌ అక్కడికి చేరుకున్నాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో తాంబరం నుంచి వస్తున్న రైలు కిందకు ఆమెను తోసేశాడు. దీంతో సత్య ఘటనాస్థలిలోనే మృతిచెందింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఇవీ చదవండి: అందాల పోటీల్లో గెలిస్తే ఎన్​ఆర్​ఐతో పెళ్లి.. వెరైటీ ఆఫర్​ ఇచ్చిన వారు అరెస్ట్

పేల్చే పటాకులు కాదు. తినే టపాసులు ఇవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.