Star Campaigners in Telangana Elections : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు స్టార్ క్యాంపెయినర్లు(Star Campaigners) రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తున్నారు. ఈసీ అనుమతితో.. సీఎంలు, కేంద్ర మంత్రులు, అగ్రనేతలు, ప్రముఖులను.. తమ ప్రచార తారలుగా పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి గులాబీ దళపతి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అగ్రనేత హరీశ్‌రావు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. హెలికాప్టర్‌ను ఉపయోగిస్తూ.. రోజుకు రెండు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. బీఆర్‌ఎస్(BRS)నే రాష్ట్రానికి శ్రీరామరక్ష అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ఆరు గ్యారెంటీ(Congress Six Guarantees)లతోపాటు.. తెలంగాణ ఇచ్చిన పార్టీకి.. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. చెయ్యి పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సహా పొరుగు రాష్ట్ర నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ గళాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. జాతీయ పార్టీలు ఇంకా ఎక్కువగా స్థానిక నాయకులకు అవకాశాలు ఇవ్వాలని.. అప్పుడే క్షేత్రస్థాయిలో బలోపేతమవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సీఎంల నుంచి మంత్రుల వరకు - రాజకీయ నేతలకు అడ్డా @ బర్కత్‌పురా గడ్డ
Telangana Election Campaigns : రెండు ఇంజన్ల సర్కారు, బీసీ(BJP BC CM Slogan) సీఎం నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ.. ప్రచార జోరు చూపిస్తోంది. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటివాళ్లు స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ విధానాలను ఓటర్లకు వివరిస్తున్నారు. బీఎస్పీ, ఎంఐఎం పార్టీలు సైతం తమ పార్టీలోని ముఖ్య నాయకులతో ప్రచారం చేయిస్తున్నారు. గతంలో స్థానిక నాయకులకే ఛరిష్మా ఉండేదని.. పలుకుబడి ఉన్న నేతల హహ ఇప్పుడు నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Telangana Election Polls 2023 : జాతీయ పార్టీలు 40 మంది, రాష్ట్ర పార్టీలు 20 మందిని స్టార్ క్యాంపెయినర్లను వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. స్టార్ క్యాంపెయినర్లు ఈసీ జారీ చేసే పర్మిట్‌ను తమ వాహనంపై అతికించాల్సి ఉంటుంది. ప్రచార తారతోపాటు అభ్యర్థి ర్యాలీలో పాల్గొన్నా, వేదికను పంచుకున్నా.. అందుకయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే వేస్తారు. ప్రధాని, మాజీ ప్రధాని వంటి స్టార్ క్యాంపెయినర్లు వస్తే భద్రతా ఏర్పాట్ల కోసం అయ్యే ఖర్చులో 50శాతం అభ్యర్థే భరించాల్సి ఉంటుంది. పార్టీని గెలిపించడం, ఓటింగ్ శాతం పెంచడంలో స్టార్ క్యాంపెయినర్లది ప్రధాన పాత్ర అందుకే వారికి అధిక ప్రాధాన్యత లభిస్తోంది.
రాష్ట్రంలో రసవత్తరంగా సాగుతోన్న ఎన్నికల ప్రచారాలు - రంగంలోకి దిగుతున్న స్టార్ క్యాంపెయినర్లు