ETV Bharat / bharat

అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న మైనర్​పై గ్యాంగ్​రేప్​ - గడ్డి కోసేందుకు వెళ్లిన మైనర్​పై రేప్

అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఓ మైనర్​​పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. ఈ దారుణం బిహార్​లో జరిగింది. మరోవైపు, వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన రోగికి మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. రాజస్థాన్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Teenager gang raped
మైనర్​పై సామూహిక అత్యాచారం
author img

By

Published : Aug 13, 2022, 8:40 PM IST

బిహార్ సివాన్​లో దారుణం జరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఓ మైనర్​పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ప్రతిఘటించడం వల్ల నిందితులు ఆమెను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన భగవాన్​పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: బాధితురాలి వయసు 15 ఏళ్లు. ఆమె తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. సోదరుడికి రాఖీ కట్టేందుకు కాలినడకన వెళ్తున్న మైనర్​పై ముగ్గురు యువకులు.. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతలో స్కార్పియో కారులో వెళ్తున్న వారికి బాలిక అరుపులు వినిపించాయి. వాహనంలో ఉన్న ప్రయాణికులు రావడం వల్ల నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. భగవాన్​పుర్ మహిళా పోలీసు స్టేషన్​లో నిందితులపై కేసు నమోదైంది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపారు పోలీసులు. నిందితులను పవన్ మాంఝీ, ఇమాముద్దీన్, దినేష్ రాయ్​గా గుర్తించారు. దినేష్ రాయ్, పవన్ మాంఝీలను అరెస్ట్ చేశారు. మరొక నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

చికిత్స కోసం వెళ్తే:
చికిత్స కోసం వెళ్లిన మహిళకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. ఈ ఘటన రాజస్థాన్​ జైపుర్​లోని కరధని పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. స్పృహలోకి వచ్చిన బాధితురాలు కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాన్ని చెప్పింది. జూన్ 27న జరిగిన ఈ దారుణం ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చింది.

మేత కోస్తుండగా..
ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలో దారుణం జరిగింది. పశువులకు మేత కోస్తున్న 11 ఏళ్ల మైనర్​పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన షాహి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితురాల్ని పొదల్లోకి విసిరేసి పరారయ్యాడు నిందితుడు. అంతలో బాధితురాలి సోదరుడు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ప్రియుడి ఇంట్లో ఆత్మహత్య..
ప్రియుడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఓ మైనర్. ఆమె ప్రియుడు కూడా మైనరే. అతడు విషం తాగేశాడు. వెంటనే బాలుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​శెహర్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. బాలికకు ఇంటి పక్కనే ఉన్న బాలునితో ప్రేమ వ్యవహారం ఉందని పోలీసులు తెలిపారు. శనివారం ఉదయానికి బాలిక ఉరివేసుకుని కనిపించిందని వెల్లడించారు. బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

ఇవీ చదవండి: పనిచేసే బ్యాంకుకే కన్నం 20 కోట్ల విలువైన బంగారం చోరీ

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి మళ్లీ కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.