ETV Bharat / bharat

డిగ్రీ అర్హతతో SBIలో 5280 CBO పోస్టులు - జీతం ఎంతంటే?

SBI CBO Jobs 2023 In Telugu : బ్యాంకింగ్ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్​బీఐ మొత్తం 5280 సర్కిల్​ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SBI notification for 5280 Circle Based Officer posts
SBI CBO Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 10:26 AM IST

SBI CBO Jobs 2023 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5280 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్ ద్వారా సర్కిల్ బేస్డ్​ ఆఫీసర్ (CBO) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ బ్యాంకింగ్​ జాబ్స్​పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్ https://sbi.co.in/​ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • మొత్తం ఉద్యోగాలు - 5280
  • హైదరాబాద్ సర్కిల్​లోని ఉద్యోగాలు - 425
  • అమరావతి సర్కిల్​లోని ఉద్యోగాలు - 400

విద్యార్హతలు
SBI CBO Qualifications :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు అర్హులు.
  • కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటిగ్రేటెడ్​ డ్యూయెల్ డిగ్రీ (IDD) చేసినవారు కూడా ఈ పోస్టులకు అర్హులే.
  • మెడికల్​, ఇంజినీరింగ్​, ఛార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ చేసిన అభ్యర్థులు కూడా CBO ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి
SBI CBO Age Limit :

  • అభ్యర్థులు 1993 నవంబర్ 1 తరువాత - 2002 అక్టోబర్​ 31లోపు జన్మించి ఉండాలి. అంటే అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 21 ఏళ్లు, గరిష్ఠంగా 30లోపు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి మినహాయింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు
SBI CBO Application Fee :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
SBI CBO Selection Process : అభ్యర్థులకు ముందుగా ఆన్​లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనితో ఉత్తీర్ణులైనవారికి స్క్రీనింగ్ టెస్ట్ చేపడతారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. దీనిలోనూ క్వాలిఫై అయినవారిని CBO ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్​

జీతభత్యాలు
SBI CBO Salary : సీబీఓ ఆఫీసర్లకు నెలకు రూ.36,000 నుంచి రూ.63,840 వరకు జీతం ఉంటుంది. అలాగే డియర్​నెస్ అలవెన్స్​ (DA), హౌస్​ రెంట్ అలవెన్స్​ (HRA), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్​ (CCA) కూడా లభిస్తాయి.

ముఖ్యమైన తేదీలు
SBI CBO Online Apply Last Date :

  • ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2023 నవంబర్​ 22
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 12
  • ఎస్​బీఐ సీబీఓ పరీక్ష తేదీ : 2024 జనవరి

ఎస్​ఎస్​సీ భారీ నోటిఫికేషన్​ - పదో తరగతి అర్హతతో 75,768 జీడీ కానిస్టేబుల్ పోస్టులు!

డిగ్రీ అర్హతతో ఎస్​బీఐలో 8773 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.