RRC Recruitment 2023 : భారతీయ రైల్వేస్‌లో ఉద్యోగం చేయాలని ఆశించే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ముంబయి ప్రధాన కేంద్రంగా గల రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (వెస్ట్రన్ రీజియన్) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వెస్ట్రన్ రైల్వే పరిధిలోని డివిజన్ / వర్క్‌షాప్‌ల్లో మొత్తం 3624 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
అప్రెంటీస్ పోస్టుల వివరాలు
RRC WR Apprentice Vacancy Details 2023 :
- బీసీటీ డివిజన్ - 745
- బీఆర్సీ డివిజన్ - 434
- ఓడీఐ డివిజన్ - 624
- ఆర్టీఎమ్ డివిజన్ - 415
- ఆర్జేటీ డివిజన్ - 165
- బీవీపీ డివిజన్ - 206
- పీఎల్ డబ్ల్యూ/షాప్ - 392
- ఎమ్ఎక్స్ డబ్ల్యూ/షాప్ - 77
- బీవీపీ డబ్ల్యూ/షాప్ - 112
- డీహెచ్‌డీ డబ్ల్యూ/షాప్ - 263
- పీఆర్టీఎన్ డబ్ల్యూ/షాప్ - 72
- ఎస్బీఐ ఈఎన్జీజీ డబ్ల్యూ/షాప్ - 60
- ఎస్బీఐ సిగ్నల్ డబ్ల్యూ/షాప్ - 25
- హెడ్ క్వార్టర్ ఆఫీసర్ - 35
రైల్వే అప్రెంటీస్ - ట్రేడ్ వివరాలు
RRC WR Apprentice : రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (వెస్ట్రన్ రీజియన్)లో.. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్ (ఏసీ మెకానిక్), పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), పీఏఎస్‌ఎస్‌ఏ, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, టర్నర్ మొదలైన ట్రేడుల్లో అప్రెంటిస్‌లను నియమించనున్నారు.
విద్యార్హతలు ఏమిటి?
RRC WR Educational Qualification : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తప్పనిసరిగా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి వివరాలు
RRC WR Age limit : 2023 జులై 26 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము ఎంత?
RRC WR Application Fee : అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఇది రిఫండ్ కాదు. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
RRC WR Selection Process : అభ్యర్థుల 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష/ వైవా ఉండవు.
శిక్షణ ఎంత కాలం ఉంటుంది?
RRC WR Training Period : అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.rrc-wr.com/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
RRC WR Recruitment important dates :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 2023 జూన్ 27
- దరఖాస్తుకు చివరి తేదీ : 2023 జులై 26
రైల్వే ఉద్యోగాలపై ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (వెస్ట్రన్ రీజియన్) అధికారిక వెబ్సైట్ https://www.rrc-wr.com/ ను సందర్శించండి.