అల్లరి చేస్తున్న ఓ విద్యార్థి పట్ల ప్రిన్సిపల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. బిల్డింగ్ ఒకటో అంతస్తు నుంచి రెండో తరగతి చదివే పిల్లాడిని (Principal hangs student) కిందికి వేలాడదీయడమే కారణం. సంబంధిత ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఉత్తర్ప్రదేశ్ మీర్జాపుర్లోని అహ్రౌరాలో (Mirzapur news today) సద్భావన శిక్షణ్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది.
తినే సమయంలో విద్యార్థి సోనూ యాదవ్ కాస్త అల్లరి చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ మనోజ్ విశ్వకర్మ.. సోనూను తలకిందులుగా(Principal hangs student) వేలాడదీశాడు. పక్కనే ఉన్న ఇతర విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు.
పిల్లలు అల్లరి చేస్తే సర్దిచెప్పాల్సిన గురువు.. ఇలా చేయడం గ్రామస్థులకు కూడా కోపం తెప్పించింది. తప్పు చేస్తే ఇలాంటి శిక్ష విధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు విద్యార్థి తండ్రి. ఏమన్నా అయ్యుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించాడు.
ఈ విషయం జిల్లా కలెక్టర్ (Mirzapur news today) ప్రవీణ్ కుమార్ వరకు చేరింది. ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా.. విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
ఇవీ చూడండి: 'అప్పటి వరకు తక్కువ తినండి'- ప్రజలకు కిమ్ పిలుపు!
పెయింటర్లపై మహిళ క్రూరత్వం- 26 అంతస్తుల ఎత్తులో ఉండగా తాడును కోసేసి..