ETV Bharat / bharat

ప్రకాశ్​ రాజ్​కు ఈడీ సమన్లు- రూ.100 కోట్ల స్కామ్ కేసులో విచారణ! - prakash raj 100 cr scam

Prakash Raj ED Notice : నటుడు ప్రకాశ్​ రాజ్​కు నోటీసులు జారీ చేసింది ఈడీ. మనీలాండరింగ్ కేసులో వచ్చే వారం విచారణకు రావాలని సూచించింది.

Prakash Raj ED Notice
Prakash Raj ED Notice
author img

By PTI

Published : Nov 23, 2023, 6:41 PM IST

Updated : Nov 23, 2023, 7:40 PM IST

Prakash Raj ED Notice : ప్రముఖ నటుడు ప్రకాశ్​ రాజ్​కు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు ఇచ్చింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చెన్నైలో వచ్చేవారం విచారణకు రావాలని సూచించింది. తిరుచ్చికి చెందిన ఓ ఆభరణాల సంస్థపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారణకు పిలిచింది ఈడీ. బీజేపీపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నోటీసులు రావడం గమనార్హం.

పెట్టుబడి పథకం పేరుతో మోసం!
తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ అనే పార్ట్​నర్​షిప్ కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ జువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు.. ప్రణవ్ జువెలర్స్ సేకరించిందని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధిక రిటర్న్స్ ఇస్తామని ఈ మొత్తం సేకరించారని పేర్కొన్నారు.

"ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి ఇవ్వడంలో ప్రణవ్ జువెలర్స్ విఫలమైంది. బంగారు ఆభరణాలు కొనుగోలు పేరిట షెల్ కంపెనీలకు డబ్బులు తరలించి ప్రజల్ని మోసం చేసింది. ప్రణవ్ జువెలర్స్ ఖాతాల్లో బోగస్ ఎంట్రీలు సృష్టించినట్లు సప్లయర్ పార్టీలు అంగీకరించారు. బ్యాంకు పేమెంట్లకు బదులుగా కంపెనీ నుంచి డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకున్నారు."
-ఈడీ

ప్రకాశ్ రాజ్​పై రైతుల ఆగ్రహం
కాగా, ఇదివరకే ప్రకాశ్ రాజ్​పై పలు కేసులు నమోదయ్యాయి. తమిళనాడులోని కొడైకెనాల్​లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ప్రకాశ్​ రాజ్, మరో నటుడు బాబీ సింహాపై రైతులు ఆరోపణలు గుప్పించారు. ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరైన అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు చేపట్టారని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని వల్ల పొలాలకు వెళ్లే తమకు ఇబ్బందులు కలుగుతున్నట్లు వాపోయారు. ఈ పూర్తి కథనం కోసం లింక్​పై క్లిక్ చేయండి.
ఇటీవల చంద్రయాన్-3పై ఆయన చేసిన ట్వీట్​ సైతం వివాదాస్పదమైంది. చంద్రయాన్ ల్యాండర్ పంపిన తొలి ఫొటో ఇదేనంటూ ఓ ఛాయ్​వాలా చిత్రాన్ని షేర్ చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఆయన దానిపై వివరణ ఇచ్చారు. ఏమన్నారంటే?

Prakash Raj Tweet Chandrayaan 3 : ప్రకాశ్​రాజ్​పై కేసు నమోదు.. ఆ ట్వీట్​పై క్లారిటీ ఇచ్చినా!

అరె.. నాలో అలాంటోడు ఉన్నాడని నాకు కూడా తెలీదే: ప్రకాశ్​ రాజ్​

Last Updated : Nov 23, 2023, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.