సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై పలువురు మహిళా ఎస్ఎస్సీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. అర్హత ప్రమాణాల కోసం రూపొందించిన వార్షిక రహస్య నివేదిక(యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్-ఏసీఆర్) ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంది. మహిళల పట్ల వివక్ష చూపించే విధంగా ఈ ప్రక్రియ ఉందని తెలిపింది. భారత సైన్యానికి మహిళా అధికారులు సంపాదించి పెట్టిన విజయాలను ఇది విస్మరిస్తోందని వ్యాఖ్యానించింది.
ఈ అంశంపై వాదనలు ఆలకించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. మహిళా అధికారుల అర్హతను అంచనా వేసే ఏసీఆర్ ప్రక్రియ లింగ వివక్ష సమస్యను పరిష్కరించలేకపోయిందని పేర్కొంది. ఈ సమస్యలనే గతేడాది ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించిందని తెలిపింది.
భారత సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 17న చారిత్రక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. శారీరక పరిమితుల కారణం చూపి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రం చేసిన వాదనలను తీవ్రంగా తప్పుబట్టింది.
ఇదీ చదవండి: సైన్యంలో శాశ్వత కమిషన్ కోసం మళ్లీ సుప్రీంకు