ETV Bharat / bharat

సస్పెన్షన్​పై విపక్షాల పోరుబాట.. ఆ షరతుకు ఒప్పుకుంటే ఎత్తివేస్తామన్న కేంద్రం - లోక్​సభ

Parliament session monsoon 2022: ఎంపీల సస్పెన్షన్​పై విపక్షాలు పోరు బాట పట్టాయి. 25 మంది సభ్యులపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 50 గంటల నిరసన ప్రారంభించాయి. అయితే.. తమ షరతుకు ఒప్పుకుంటే విపక్షాలు కోరినట్టు చేస్తామని స్పష్టం చేసింది అధికార పక్షం.

parliament
పార్లమెంటు
author img

By

Published : Jul 27, 2022, 5:05 PM IST

Parliament session monsoon 2022: పార్లమెంటులో సస్పెన్షన్​, వాయిదాల పర్వం బుధవారం కూడా కొనసాగింది. ఇరు సభల్లోనూ విపక్షాలు కేంద్రంపై నిరసనకు దిగాయి. ఇప్పటికే 24 మంది ఎంపీలు సస్పెన్ష్​కు గురవగా.. తాజాగా బుధవారం మరో రాజ్యసభ ఎంపీపై వేటు పడింది. అనుచితంగా ప్రవర్తన కారణంగా ఆమ్​ఆద్మీ పార్టీ నేత సంజయ్​ సింగ్​ను సస్పెండ్​ చేశారు.

ఎంపీల సస్పెన్ష్​ను విపక్షాలు తప్పుపట్టాయి. సస్పెన్ష్​ను తక్షణమే ఎత్తివేయాలంటూ డిమాండ్​ చేశాయి. సస్పెన్షన్​కు గురైన 20 మంది రాజ్యసభ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. 50 గంటలపాటు ఇలానే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత రెండు రోజుల్లో సస్పెన్షన్​కు గురైన 20 మంది ఎంపీల్లో తృణమూల్​ కాంగ్రెస్​కు చెందిన వారు ఏడుగురు, డీఎంకే నుంచి ఆరుగురు, తెరాస చెందిన వారు ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ ఆమ్​ఆద్మీల నుంచి చెరో ఎంపీ ఉన్నారు.

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ఒక రాజు అని.. అందుకే 57 మంది ఎంపీలను, 25 ఎంపీలను సస్పెండ్​ చేయించారన్నారు. ప్రశ్నలకు భయపడే మోదీ ఇదంతా చేస్తున్నారన్నారు.

rahul
రాహుల్​ ఆధ్వర్యంలో పార్లమెంటు బయట నిరసన
rahul
పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతున్న ఎంపీలు

స్పీకర్ల కండీషన్​: రాజ్యసభలో ఎంపీల సస్పెన్ష్​పై విపక్ష నేతలు.. ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. సస్పెన్షన్​ తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే చేసిన తప్పును ఒప్పుకుంటేనే సస్పెన్షన్​ తొలగిస్తానని వెంకయ్య స్పష్టం చేశారు. 10 మంది నేతలు పాల్గొన్న ఈ భేటీలో ధరల పెంపుపై సభలో చర్చకు అవకాశం కల్పించాలని నేతలు వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు వరుస సస్పెన్ష్​లతో సభలో గందరగోళం నెలకొనగా సమావేశాలను గురువారానికి వాయిదా వేశారు. బుధవారం సెషన్​లో రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది.

లోక్​సభలోనూ ఇదే పరిస్థితి.. ధరల పెంపు, అగ్నిపథ్​, జీఎస్​టీ మొదలైన అంశాలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురు కాంగ్రెస్​ ఎంపీలు సస్పెన్షన్​కు గురయ్యారు. ఎంపీల సస్పెన్షన్​ ఎత్తివేయాలని ప్రతిపక్ష నేతలు కోరగా.. ఇకపై నిరసనలు చేపట్టమని హామీ ఇస్తేనే ఉపసంహరణ చర్యలు చేపడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి స్పష్టం చేశారు. వెల్​ వద్దకు వెళ్లకుండా, ఎలాంటి ప్లకార్డులు ప్రదర్శన చేపట్టమని హామీ ఇవ్వాలన్నారు.

ఇదీ చూడండి : 'ఇక మీరే చూసుకోండి!'.. జిల్లా కలెక్టర్​ బాధ్యతల్ని భర్తకు అప్పగించిన భార్య!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.