Jawad Cyclone News Latest: వాయుగుండంగా బలహీనపడిన జవాద్ తుపాను ప్రభావంతో ఒడిశాలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంజాం, ఖుద్రా, పూరీ, కేంద్రపారా, జగత్‌సింగ్ పూర్ ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. అనేకచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీనితో ముందస్తు జాగ్రత్తగా బీచ్‌లలోని పర్యాటకులను ఖాళీ చేయించారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. జవాద్ తుపాను ప్రభావంతో బంగాల్‌లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
Cyclone Jawad: జవాద్ తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. తుపాను బలహీనపడిన నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
Jawad Cyclone News alert: మరోవైపు.. జవాద్ తుపాను ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సోమవారం బయలుదేరాల్సిన భువనేశ్వర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17015), పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్(17479) సహా పలు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: