ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ముస్లిం మహిళల హక్కుల దినోత్సవం

author img

By

Published : Aug 1, 2021, 7:01 PM IST

ట్రిపుల్ తలాఖ్ చట్టం తీసుకొచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ముస్లిం మహిళల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముగ్గురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

talaq
ట్రిపుల్ తలాఖ్, హక్కుల దినం

ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా చట్టం తెచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ముస్లిం మహిళల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాయి. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు కేంద్ర మంత్రులు పాల్గొని.. ట్రిపుల్ తలాఖ్‌ బాధిత మహిళలతో మాట్లాడారు.

కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్‌.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాఖ్‌ చట్టం తెచ్చిన ప్రధాని మోదీకి.. బాధిత ముస్లిం మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.

2019 ఆగస్టు 1న ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా తెచ్చిన చట్టం ద్వారా తమ రాజ్యాంగపరమైన, ప్రాథమికమైన, ప్రజాస్వామ్యయుత హక్కులను మోదీ సర్కార్ కాపాడిందని మహిళలు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన, జన్‌ధన్ యోజన, స్టాండప్ ఇండియా, పోషణ్ అభియాన్‌ల ద్వారా ము‌స్లిం మహిళలకు.. ఎంతో లబ్ది చేకూరుతుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. వివక్షలేని అభివృద్ధి అనే మోదీ ప్రభుత్వ విధానం దేశవ్యాప్తంగా నమ్మకమనే వాతావరణాన్ని ఏర్పరిచిందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:'ట్రిపుల్​ తలాఖ్​ కేసుల్లో ముందస్తు బెయిల్​ జారీ చేయొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.