ETV Bharat / bharat

రైల్వే వంతెనను స్కూల్​గా మార్చిన యువతి

కాలివంతెనపైన నివసించే పిల్లలకు అండగా నిలుస్తున్నారు ముంబయికి చెందిన ఓ యువతి. స్థానిక రైల్వే స్టేషన్ల సమీపంలోని ఫుట్​ఓవర్​ బ్రిడ్జ్​లపై ఉన్న పిల్లలకు గత మూడేళ్లుగా చదువు చెప్తూ.. వారి ఆలనాపాలనా చూస్తున్నారు జానూన్​ ఎన్​జీఓ అధ్యక్షురాలు హేమంతి సేన్.

mumbai school
పిల్లల దగ్గరకే పాఠశాల తెచ్చిన యువతి
author img

By

Published : Oct 4, 2021, 6:46 AM IST

కాలివంతెనపైన నివస్తున్న పిల్లలకు చదువు చెప్తున్న హేమంతి సేన్

అది మహారాష్ట్ర ముంబయి శివారులోని బోరీవలీ రైల్వేస్టేషన్. అక్కడ ఉన్న ఓ కాలివంతెన ప్రయాణికుల సౌకర్యం కోసం నిర్మించిందే అయినా.. కొందరికి అదే ఆవాసం. చదువుకోవాల్సిన వయసులో సరైన సౌకర్యాలు లేని ఎందరో పిల్లలు.. ఆ వంతెనమీదే ఆటపాటలతో కాలం గడుపుతుంటారు. రోజూ ఎంతో మంది వంతెన మీదుగా నడుస్తున్నా.. ఈ పిల్లల గురించి పెద్దగా పట్టించుకునే వారు లేరు.

mumbai footpath school
పిల్లలకు చదువు చెప్తున్న హేమంతి సేన్​
mumbai footpath school
చదువుకుంటున్న పిల్లలు

ఈ దుస్థితిని గమనించిన ఓ యువతి.. అందరిలా పట్టించుకోకుండా వెళ్లిపోలేదు. పిల్లల భవిష్యత్తుకు భరోసాగా తానున్నానంటూ ముందుకొచ్చారు. ఆ వంతెనపైనే వారికి ఓనమాలు నేర్పిస్తూ.. అండగా నిలుస్తున్నారు. తనే.. జానూన్​ ఎన్​జీఓ అధ్యక్షురాలు హేమంతి సేన్.

రోజూ హేమంతి ఆ వంతెన వద్దకు చేరుకుంటారు. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకొని వారితో అక్షరాలు దిద్దిస్తారు. కాలివంతెనలే దిక్కుగా బతుకుతున్న పిల్లలకు మూడేళ్లుగా ఇలా చదువు చెప్పడం సహా వారి ఆలనాపాలనా చూస్తున్నారు హేమంతి సేన్.

"నేను మొదట కాందివలీ స్టేషన్​లో కొంత మంది పిల్లల్ని కలిశాను. రోజంతా ఏదో ఒక పని చేస్తూ ఉండటం వల్ల వారికి చదువుకునేందుకు అవకాశం కూడా లేదు. ఫలితంగా వారి విలువైన సమయం వృథా అవుతోంది. వీరి తల్లిదండ్రులు కూడా చదువుకోలేదు. అందువల్ల వారికి చదువు విలువ తెలియలేదు. గత మూడేళ్ల నుంచి మేమే ఈ పిల్లల చదువు, ఆలనాపాలనా చూస్తున్నాం."

-హేమంతి సేన్, జానూన్​ ఎన్​జీఓ అధ్యక్షురాలు

చదువు చెప్తామని అక్కడికి వెళ్లినప్పుడు పిల్లల తల్లిదండ్రులు తమ మాట వినలేదని.. అయితే, పాఠశాలనే వారి వద్దకు వస్తోందని తెలిసి సంతోషంగా అంగీకరించారని హేమంతి చెబుతున్నారు.

ఇదీ చూడండి : Selfie Craze: 140 అడుగుల ఎత్తు నుంచి పడి.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.