ETV Bharat / bharat

కుమారైను గర్భవతి చేసిన తండ్రికి 20 ఏళ్లు జైలు.. క్షమించి వదిలేయాలన్న బాధితురాలు.. చివరకు.. - రేప్​ కేసు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

ఓ తండ్రి చేసిన పని సమాజం తలదించుకునేలా చేస్తోంది. కుమారైను కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యక్తే కామాంధుడిగా మారాడు. దాదాపు తొమ్మిది నెలల పాటు సవతి కుమారైపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్​ బాలిక గర్భం దాల్చింది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసులో.. బుధవారం ప్రత్యేక కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

Mumbai special court
Mumbai special court
author img

By

Published : Nov 30, 2022, 6:42 PM IST

మహారాష్ట్రలో సవతి కుమారైపై అత్యాచారం చేసిన ఓ తండ్రికి.. ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ దారుణం 2019లో జరగగా.. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. కానీ తన తండ్రిని క్షమించాలని.. జైలులో పెట్టొదని బాధితురాలే కోర్టును కోరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. డీఎన్​ఏ నివేదిక ఆధారంగా నిందితుడికి శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది.

వివరాల్లోకి వెళ్తే..
ముంబయిలో ఓ తండ్రి(41) తన మైనర్​ సవతి కుమారైపై 2019 అక్టోబర్ నుంచి 2020 జూన్​ వరకు లైంగికంగా వేధించాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. బాధితురాలు తన తల్లి సహాయంతో.. ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

డీఎన్​ఏ రిపోర్టే ఆధారం
బాలికకు వైద్య పరీక్షలు చేయగా అప్పటికే నాలుగు నెలల గర్భవతని గుర్తించారు. వెంటనే వైద్యులు దాన్ని కోర్టు అనుమతితో తొలగించారు. బాధితురాలు నుంచి సేకరించిన రక్తపు నమూనాలు నిందితుడి డీఎన్​ఏతో పోలి ఉన్నందున.. ఆమె గర్భం దాల్చటానికి కారణం తండ్రే అని తేలింది. దీనిని ఘోరమైన నేరంగా పరిగణించిన కోర్టు నిందితుడికి.. 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఆయన్ను క్షమించి వదిలేయండి..!
కేసు విచారణ సమయంలో తల్లి, కుమారై నిందితుడికి అనుకూలంగా మాట్లాడారు. ఎందుకంటే అతడే వారి కుటుంబానికి జీవనాధారం. అందుకే నిందితుడిని క్షమించి వదిలేయాలని బాధితురాలు, ఆమె తల్లి కోర్టును కోరారు. ఇద్దరూ అతడికి అనుకూలంగా వాదించినా.. దోషిని ఎలా శిక్షించకుండా ఉంటామని న్యాయస్థానం వారిని ప్రశ్నించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.