ETV Bharat / bharat

పసికందును ట్యాంకులో ముంచి చంపిన తల్లి - కన్న కూతురుని చంపిన తల్లి

నీటలో ముంచి మనిషిని ఎలా చంపాలి? అని ఆన్​లైన్​లో వెతికింది ఓ మహిళ. చివరికి దాన్ని కడుపున పుట్టిన కన్న కూతురి మీదే ప్రయోగించింది. ఇంటి మీద ఉండే ట్యాంక్​లో మూడు నెలలు కూడా నిండని పసికందును పడేసి ప్రాణం తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినిలో జరిగింది. వేరు కాపురానికి భర్త ఒప్పుకోకపోవడం వల్ల భార్య సహనం కోల్పోయి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.

Woman kills infant daughter
కూతురిని ట్యాంకులో ముంచి చంపిన తల్లి
author img

By

Published : Oct 24, 2021, 2:15 PM IST

మూడు నెలలు కూడా నిండని పసికందును చంపేసింది ఆ కన్న తల్లి. నీటిలో ముంచి ఓ వ్యక్తిని ఎలా చంపాలి అనే విషయాన్ని గూగుల్​లో వెతికి మరీ.. ఆ చిన్నారిపై ప్రయోగించింది. ఎవరికీ సందేహం రాకుండా ఇంటిపైన ట్యాంక్​లో చిన్నారిని పడేసి ప్రాణాలు బలి తీసుకుంది. ఆ తర్వాత ఏమీ తెలియని అమాయకురాలిలా నటిస్తూ.. బిడ్డ తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. విచారించగా అసలు నిజం బయటపడింది. తల్లి నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​ ఉజ్జయిని జిల్లాలోని ఖార్ఛోద్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

వేరు కాపురం పెట్టాలని భర్తపై బలవంతం చేసింది నిందితురాలు. ఇందుకు ఆయన ఒప్పుకోకపోవడం వల్ల దారుణానికి ఒడిగట్టింది. ఓ మనిషిని నీటిలో ముంచి ఎలా చంపాలి అని ఆన్​లైన్​లో వెతికింది. తర్వాత పక్కా ప్రణాళిక రచించి తన మూడు నెలల చిన్నారిని ఇంటిపైన ఉండే ట్యాంక్​లో పడేసి చంపేసింది. చిన్నారి కనిపించడం లేదని ముందస్తుగానే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. ప్రతీ చోట వెతికినా.. ఆ పసికందు ఆనవాళ్లు కనిపించక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులను పోలీసులు విచారించగా.. ఆ మహిళ నిజం ఒప్పుకుంది. భర్త ఆన్​లైన్​ క్లాసులు చెప్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వివరించింది.

ఇదీ చూడండి: పార్లమెంట్​ పాస్​నే ఫోర్జరీ చేసిన ఘనుడు.. చివరకు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.