ఐదు పదుల వయసు దాటే సరికే జీవితం అయిపోయింది అంటూ డీలా పడిపోతుంటారు చాలా మంది. శరీర పటుత్వం కోల్పోయినా పట్టుదలతో అనుకున్న పనిని సాధించే వారిని చాలా అరుదుగా చూస్తాం. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బామ్మ వృద్ధాప్యంలోనూ ఇంకా ఒంట్లో సత్తా ఉందని నిరూపించింది. 90 ఏళ్ల వయసులో తనకు ఇష్టమని కారు డ్రైవింగ్ నేర్చుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. బామ్మ కారు డ్రైవింగ్ విషయం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు చేరింది. ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా బామ్మను అభినందించారు.
-
दादी मां ने हम सभी को प्रेरणा दी है कि अपनी अभिरुचि पूरी करने में उम्र का कोई बंधन नहीं होता है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
उम्र चाहे कितनी भी हो, जीवन जीने का जज़्बा होना चाहिए! https://t.co/6mmKN2rAR2
">दादी मां ने हम सभी को प्रेरणा दी है कि अपनी अभिरुचि पूरी करने में उम्र का कोई बंधन नहीं होता है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 23, 2021
उम्र चाहे कितनी भी हो, जीवन जीने का जज़्बा होना चाहिए! https://t.co/6mmKN2rAR2दादी मां ने हम सभी को प्रेरणा दी है कि अपनी अभिरुचि पूरी करने में उम्र का कोई बंधन नहीं होता है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 23, 2021
उम्र चाहे कितनी भी हो, जीवन जीने का जज़्बा होना चाहिए! https://t.co/6mmKN2rAR2
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా బిలావాలీకి చెందిన 90 ఏళ్ల రేషమ్ బాయ్‌కు డ్రైవింగ్ అంటే ఆసక్తి. ఇంట్లో అందరికీ డ్రైవింగ్ రావడం, తన మనవళ్లు, మనవరాళ్లు కూడా డ్రైవింగ్ నేర్చుకునే సరికి ఆ ఆసక్తి మరింత పెరిగింది. ఇదే విషయాన్ని తన కుమారుల వద్ద ప్రస్తావించగా వయసును దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. అయినా పట్టువదలని బామ్మ.. తన చిన్న కుమారుడి సాయంతో నేర్చుకుంది. కేవలం మూడు నెలల్లోనే అనుభవజ్ఞులు నడిపినట్టు కారు నడపసాగింది. హైవే మీద 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.
కారు డ్రైవింగ్ నేర్చుకోవడం కన్నా ముందు తనకు ట్రాక్టర్ నడిపిన అనుభవం ఉందన్నారు రేషమ్ బాయ్.
"ఇంట్లో అందరికీ డ్రైవింగ్ వచ్చు. మనవళ్లు, మనవరాళ్లు కూడా డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల నాకు కూడా ఆసక్తి పెరిగింది. ఇంట్లో ఉంటే బోర్ కొడుతోంది. అది కూడా నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఓ కారణం."
-రేషమ్ బాయ్
ఇప్పటివరకు ఎక్కువ దూరం డ్రైవ్ చేయలేదని.. లైసెన్స్ వచ్చాక భోపాల్ వరకు కారులో వెళ్లి వస్తానని చెప్పుకొచ్చింది. కారు నడపగలుగుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.
90 ఏళ్ల వయసులోనూ తన పని తాను చేసుకుంటూ కుటుంబసభ్యులకు వ్యవసాయంలో సాయం చేస్తూ ఉంటుందీ బామ్మ. ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే కూడా ఆసక్తి అని.. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్ అంటే మరింత మక్కువ అని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపనకు వయసుతో సంబంధం ఉండదని నిరూపించిన ఈ బామ్మ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చూడండి : సోషల్ మీడియా ఎఫెక్ట్: భర్త పళ్లు రాలగొట్టిన భార్య!