ETV Bharat / bharat

చెలరేగిన నక్సల్స్​.. పోలీసులపై బాంబు దాడి, వాహనాలకు నిప్పు!

రహదారి నిర్మాణంలో ఉన్న ఓ ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు మావోయిస్టులు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్ అమర్చిన బాంబు పేలి ఇద్దరు పోలీసు అధికారులతో సహా నలుగురు సీఆర్​పీఎఫ్ సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు.

Maoists set fire on JCB
నక్సల్స్ నిప్పంటించిన జీసీబీ
author img

By

Published : Feb 9, 2022, 7:05 AM IST

ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కియాముండా ప్రాంతంలో రహదారి నిర్మాణంలో ఉన్న ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను రద్దు చేయాలని లేఖ విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

సమీప గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఘటనా స్థలంలో పోస్టర్​ను అతికించి వెళ్లారు. సీఆర్​పీఎఫ్ క్యాంపుల నిర్వహణ, నక్సల్స్ పేరుతో ప్రజలను నిర్బంధించి డబ్బులు వసూలు చేస్తూరని ఆరోపించారు.

బాంబు పేలి..

మవోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో సహా నలుగురు సీఆర్​పీఎఫ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని బీజాపుర్ జిల్లాలో జరిగింది.

జిల్లాలోని మోదక్​పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్కినార్ రోడ్డులో బెటాలియన్ బృందం ఆపరేషన్​లో ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఐఈడీ బాంబు పేలింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: యూపీలో ఉగ్రకుట్ర భగ్నం.. ఆల్​ఖైదా తీవ్రవాది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.