ETV Bharat / bharat

'న్యాయ వృత్తి లాభం కోసం కాదు.. సమాజ సేవకే' - కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు?

న్యాయవాద వృత్తి అనేది లాభాన్ని పెంచుకోవడం కోసం కాకుండా.. సమాజానికి సేవ చేయడం కోసమేనని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మంగళవారం అన్నారు. న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

cji
సీజేఐ
author img

By

Published : Nov 9, 2021, 10:23 PM IST

న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు.. న్యాయవాదులు సమాజంలోని అణగారిన వర్గాల గొంతుకుగా ఉండేలా శక్తిమంతం కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆకాక్షించారు. న్యాయవాద వృత్తి లాభాలను అర్జించడం కోసం కాదని.. సమాజానికి సేవ చేసేందుకేనని అభిప్రాయపడ్డారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"అవసరమైన వారికి న్యాయ సహాయం అందించేందుకు ముందుకు రావాలన్న మీ నిర్ణయం గొప్పది. పేదలపట్ల సానుభూతి, వారి కష్టాల పట్ల అవగాహన, సేవ చేయడంలో నిస్వార్థ భావాన్ని పెంపొందించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇతర వృత్తుల మాదిరిగా కాకుండా.. న్యాయవాద వృత్తిని లాభం కోసం కాకుండా.. సమాజ సేవ కోసమే ఎంచుకోండి."

---సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

నల్సా ఆధ్వర్యంలో నిర్వహించే మూట్ కోర్ట్ పోటీల్లో పాల్గొని ఉత్సాహం చూపిన యువ న్యాయ విద్యార్థుల పట్ల జస్టిస్ ఎన్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు.

"మీ చుట్టూ ఉన్న సమాజం పట్ల అప్రమత్తంగా ఉంటూ.. సమస్యలపై సరైన సమయంలో స్పందించడం మీ కర్తవ్యం. నిరుపేదలకు న్యాయ సహాయం అందించడంలో న్యాయ విద్యార్థులు ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నా.

---సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

ఈ సందర్భంగా నల్సా ఆన్‌లైన్ పోర్టల్ సేవలను మరిన్ని భాషల్లో ఆవిష్కరించిన జస్టిస్ ఎన్వీ రమణ.. లీగల్ సర్వీసెస్ అప్లికేషన్ ఐఓఎస్ వెర్షన్‌ను ప్రారంభించారు.

'జడ్జీలపై సామాజిక మాధ్యమాల్లో దాడులు..'

ఈ కార్యక్రమానికి హాజరైన కిరణ్ రిజిజు.. సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల్లో న్యాయమూర్తులపై అభ్యంతకరమైన పోస్టులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశసేవలో న్యాయమూర్తులు పడిన శ్రమ గురించి చాలా మందికి అర్థం కావడం లేదు. వారి పనితీరు ఎంతో గొప్పది. మనలాంటి వారు దగ్గరగా చూస్తే తప్ప అర్థం చేసుకోలేం.

--కిరణ్ రిజిజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి

మరోవైపు.. శాసన, న్యాయవ్యవస్థలు ఒకదానిపై మరొకటి నియంత్రణ కోసం పోటీపడట్లేదని రిజిజు స్పష్టం చేశారు. దేశాన్ని బలమైన ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు ఈ రెండు జట్టుగా పనిచేస్తున్నాయన్నారు. 'కనీస న్యాయం కోసం ప్రజలు కష్టపడాల్సిన అవసరం లేదని శాసన, న్యాయవ్యవస్థలు కోరుకుంటున్నాయి,' అని అన్నారు.

దిగువ కోర్టుల్లో నాలుగు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. అందువల్ల కిందిస్థాయి న్యాయవ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.