ETV Bharat / bharat

ఇంట్లోవాళ్లకు చిన్నారి షాక్​.. పిల్లి అనుకుని చిరుత పిల్లను తెచ్చి.. - మహారాష్ట్ర నాశిక్

సరదాకొద్దీ దారిలో కనిపించే కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో పెంచుకుందామని ఇంటికి తెచ్చేస్తుంటారు కొంతమంది పిల్లలు. మహారాష్ట్రలోని నాశిక్​లో ఓ చిన్నారి కూడా అదే పని చేసింది. కానీ అది చూసి ఇంటివాళ్లు హడలిపోయారు. ఎందుకంటే ఆమె తెచ్చింది పిల్లిని కాదు.. చిరుత పిల్లని!

d
dd
author img

By

Published : May 12, 2022, 7:44 PM IST

Updated : May 12, 2022, 8:29 PM IST

పిల్లి అనుకుని చిరుత పిల్లను తెచ్చిన చిన్నారి

ఆడుకోవడానికి బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన చిముకల్య అనే ఓ చిన్నారి.. పెద్ద వాళ్లంతా హడలిపోయే పని చేసింది. పిల్లి అనుకుని దారిలో కనిపించిన ఓ జంతువును వెంట తెచ్చుకుంది. కుటుంబసభ్యులు కూడా మొదట అది పిల్లికూన అనే అనుకున్నారు. కానీ కొద్దిసేపటికి తెలిసింది అది చిరుత పిల్ల అని. దీంతో వారు ఒక్కక్షణం కంగారు పడిపోయారు. అయితే ఆ చిరుత బాగా చిన్నది అవడం.. ఎలాంటి ప్రాణహాని జరిగే అవకాశం లేకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర మాలేగావ్​లోని మోర్జార్​ శివరా ప్రాంతంలో నివసిస్తున్న రావ్​సాహేబ్​ ఠాక్రే అనే వ్యక్తి ఇంటి దగ్గర జరిగింది. ​

maharashtra nashik news
చిరుత పిల్లతో చిముకల్య, ఆమె కుటుంబసభ్యులు
maharashtra nashik news
చిరుత పిల్లతో చిన్నారి చిముకల్య
maharashtra nashik news
చిరుతతో చిన్నారి

కానీ ఏ క్షణంలోనైనా ఆ చిరుత కూన కోసం తల్లి రావొచ్చని భావించిన చిన్నారి కుటుంబసభ్యులు చిరుత పిల్లను వారం రోజుల పాటు తమ వద్దే ఉంచుకున్నారు. ఎక్కడా తల్లి చిరుత జాడ లేకపోవడం వల్ల ఈ చిరుత పిల్ల గురించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిన్నారి నివసిస్తున్న ప్రాంతానికి చేరుకున్న అధికారలు చిరుత పిల్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆ వారం రోజులు ఠాక్రే కుటుంబసభ్యులు చిరుత పిల్లకు అన్ని రకాల సదుపాయాలు చేశారు. రోజుకు 1.5 లీటర్లు చొప్పున పాలు పట్టేవారు. ఈ ఏడు రోజులూ చిరుత పిల్లను చూసి ఠాక్రే కుటుంబసభ్యులు కంగారు పడుతుంటే.. చిన్నారి చిముకల్య మాత్రం ఎంచక్కా ఆ కూనతో ఆడుకుంది. ఈ ఘటన కొద్దిరోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్​టాపిక్​గా మారిపోయింది.

ఇదీ చూడండి : హత్య కేసులో బెయిల్​పై రిలీజ్​.. పెళ్లికి ఒప్పుకోలేదని గర్ల్​ఫ్రెండ్​ దారుణ హత్య

Last Updated : May 12, 2022, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.