ETV Bharat / bharat

అక్రమంగా తిరుగుతుండగా 'అమితాబ్' కారు సీజ్​! - కర్ణాటక బెంగళూరు తాాజా వార్తలు

నకిలీ గుర్తింపు పత్రాలతో రిజిస్టర్ అయిన.. 15 లగ్జరీ కార్లను బెంగళూరు ఆర్​టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అమితాబ్​ బచ్చన్​ పేరు మీదుగా ఉన్న ఓ రోల్స్​ రాయిస్​ కారు కూడా ఉంది.

amitab car seize
అమితాబ్​ కారు సీజ్​!
author img

By

Published : Aug 23, 2021, 10:56 AM IST

బెంగళూరులో అమితాబ్ కారు సీజ్​!

సరైన పత్రాలు లేకుండా బెంగళూరు నగర రోడ్లపై తిరుగుతున్న లగ్జరీ కార్లను అక్కడి రోడ్డు రవాణా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు పన్ను ఎగవేసేందుకు నకిలీ గుర్తింపు పత్రాలను కార్ల యజమానులు వినియోగిస్తున్నారని అధికారులు గుర్తించారు.

అమితాబ్ కారు కూడా..

పోలీస్​ కమిషనర్​ నరేంద్ర హోల్కర్​, ఇన్​స్పెక్టర్​ తిప్పేస్వామి నేతృత్వంలోని ఆర్​టీఏ అధికారుల బృందం.. ఈ ఆపరేషన్​ను నిర్వహించింది. నకిలీ గుర్తింపు పత్రాలతో రిజిస్టర్​ అయిన 15 లగ్జరీ కార్లను అధికారులు గుర్తించారు. వారు స్వాధీనం చేసుకున్న కార్లలో.. బాలీవుడ్​ నటుడు అమితాబ్​ బచ్చన్​ పేరు మీద రిజిస్టర్​ అయిన ఓ రోల్స్​ రాయిస్​ కారు కూడా ఉండటం గమనార్హం. మరో రెండు కార్లు.. శాసన మండలి సభ్యుడు ఫరూక్​ పేరు మీదుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

rolce royce car of amitab bachhan
అధికారులు స్వాధీనం చేసుకున్న రోల్స్​ రాయిస్​ కారు

అమితాబ్​ బచ్చన్​ పేరు మీదుగా ఉన్న రోల్స్​ రాయిస్ కారు.. బెంగళూరులో రెండేళ్లకు పైగా తిరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. అయితే.. ఇప్పటివరకు ఆ కారును వారు గుర్తించలేకపోయారు. ఉమ్రా డెవలపర్స్​ సంస్థ యజమాని బాబు.. అమితాబ్​ బచ్చన్​ నుంచి ఈ రోల్స్ రాయిస్​ కారును రూ.6 కోట్లకు కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. అయితే.. ఇంకా ఆ కారు అమితాబ్​ బచ్చన్​ పేరు మీదే ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: కట్నంగా ముంబయి నగరం.. ఏడాదికి 10 పౌండ్ల లీజు!

ఇదీ చూడండి: కారులో నలుగురు యువకులు.. ఒక్కసారిగా మంటలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.