ETV Bharat / bharat

500 కిలోల నగలు ఉన్నా తెల్ల రేషన్ కార్డ్.. కౌన్సిలర్​కు కోర్టు షాక్ - కర్ణాటక లేటెస్ట్ న్యూస్

ఆయన దగ్గర 500 కిలోల నగలు ఉన్నాయి. అద్దెల రూపంలో రూ.3.6లక్షల ఆదాయం వస్తోంది. అయినా.. పేదవాళ్లకు ప్రభుత్వం ఇచ్చే తెల్ల రేషన్​ కార్డ్ కలిగి ఉన్నారు. చివరకు నగర పాలక సంస్థ కౌన్సిలర్​ పదవి పోగొట్టుకున్నారు.

sira councillor news
sira councillor news
author img

By

Published : Sep 9, 2022, 7:31 PM IST

భారీగా ఆస్తులు ఉన్నా, తెల్ల రేషన్​ కార్డ్​ కలిగి ఉన్న నగర పాలక సంస్థ కౌన్సిలర్​ ఎన్నిక చెల్లదని ప్రకటించింది కర్ణాటకలోని ఓ కోర్టు. ఎన్నికల అఫిడవిట్​లో వాస్తవాల్ని దాచిపెట్టారని నిర్ధరిస్తూ తుమకూరు జిల్లా సిరాలోని న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఫలితంగా జేడీఎస్​ కౌన్సిలర్ రవి శంకర్​ పదవి కోల్పోయారు.

ఇదీ జరిగింది..: సిరా నగర పాలక సంస్థకు 2021 డిసెంబర్​ 30న ఎన్నికలు జరిగాయి. 9వ వార్డుకు జేడీఎస్​ తరఫున రవి శంకర్, కాంగ్రెస్​ టికెట్​పై కృష్ణప్ప పోటీపడ్డారు. రవి శంకర్ విజయం సాధించారు. అయితే.. ఆయన​ ఎన్నికను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్​ వేశారు కృష్ణప్ప. ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలిన విషయాన్ని ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొనలేదని వాదించారు. 500 కిలోల బంగారం ఉందని, అద్దెల ద్వారా రూ.3.6లక్షల ఆదాయం వస్తోందని అఫిడవిట్​లో చెప్పినా.. రవి శంకర్​ పేదలకు ఇచ్చే బీపీఎల్​ రేషన్​ కార్డ్ కలిగి ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కృష్ణప్ప.

ఈ ఆరోపణలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేశారు రవి శంకర్. క్రిమినల్ కేసు గురించి అఫిడవిట్​లో ప్రస్తావించడం మర్చిపోయానని కోర్టుకు నివేదించారు. తన దగ్గర 499.5కిలోల వెండి, 500 గ్రాముల బంగారం ఉందని.. అయితే అఫిడవిట్​లో రెండూ కలిపి 500 కిలోల ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నానని వివరించారు. కానీ.. కోర్టు విట్​నెస్​ బాక్స్​లో ఈ విషయాలు చెప్పలేదు రవి శంకర్. లిఖితపూర్వక సమాధానంతో సరిపెట్టారు.

చివరకు.. రవి శంకర్​ వాస్తవాల్ని దాచిపెట్టారని న్యాయస్థానం నిర్ధరించింది. ఇలా చేయడం రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. విట్​నెస్​ బాక్స్​లోకి వచ్చి పిటిషనర్ వాదనల్ని తిప్పికొట్టకపోవడాన్నీ తప్పుబట్టింది. సిరా నగర పాలక సంస్థ 9వ వార్డు కౌన్సిలర్​గా ఆయన ఎన్నిక చెల్లదని ఆగస్టు 26న తీర్పు ఇచ్చింది.

ఇవీ చదవండి: 'రూ.41వేల టీషర్ట్​ వేసుకుని పాదయాత్ర'.. రాహుల్​పై భాజపా సెటైర్

ఆరు నెలల చిన్నారికి పూజలు.. దర్శనం కోసం వందలాది మంది క్యూ.. ఆ మచ్చలే కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.