ETV Bharat / bharat

టేకాఫ్​ అవుతుండగా జారి.. బురదలోకి దూసుకెళ్లిన విమానం! - రన్​వేపై అదుపుతప్పిన ఇండిగో

Flight Skids Off Runway: ఇండిగోకు చెందిన మరో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఫ్లైట్​ టేకాఫ్​ అవుతుండగా.. రన్​వే పైనుంచి జారింది. దీంతో టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకున్నాయి.

Indigo flight skids off runway in Jorhat, wheels get stuck in outfield

author img

By

Published : Jul 29, 2022, 1:00 PM IST

Flight Skids Off Runway: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్‌ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్‌వే నుంచి జారి.. విమానం టైరు బురదలో చిక్కుకుపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
అసోం జోర్హాట్​ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్‌ అవుతుండగా రన్‌వే పై నుంచి జారింది. రెండు టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను క్షేమంగా కిందకు దించేశారు. అయితే ఆ తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులున్నారు. వారిని మరో విమానంలో పంపించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Indigo flight skids off runway in Jorhat, wheels get stuck in outfield
బురదలోకి దూసుకెళ్లిన విమానం

ఇటీవల కొంతకాలంగా పలు విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పైస్‌జెట్‌, ఇండిగో విమానాల్లో ఈ లోపాలు ఎక్కువగా బయటపడ్డాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ చర్యలు చేపట్టింది. బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్‌ ఉన్న నిపుణులైన ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో విమానాలను విడుదల చేయాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. 8 వారాల పాటు స్పైస్‌జెట్‌ విమానాలను 50 శాతం మాత్రమే నడపాలని ఆంక్షలు విధించింది.

ఇవీ చూడండి: 'ఇకపై 50% ఫ్లైట్లనే నడపాలి'.. స్పైస్​జెట్​కు డీజీసీఏ షాక్

హడావుడిగా పాక్​లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్​కు​ వస్తుండగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.