ETV Bharat / bharat

కరోనా విజృంభణ- భారత్​లో ఒక్కరోజే 2.38 లక్షల కేసులు - ఇండియా కరోనా కేసులు

Covid cases in India: భారత్​లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో 2,38,018 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజు 310 మంది మరణించారు. 1,57,421 మంది కొవిడ్​ను జయించారు.

INDIA CORONA CASES
కరోనా
author img

By

Published : Jan 18, 2022, 9:24 AM IST

Updated : Jan 18, 2022, 11:05 AM IST

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,38,018 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 310 మంది మరణించారు. 1,57,421 మంది కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 94.03 శాతం నమోదైందని పేర్కొంది. అయితే.. యాక్టివ్​ కేసుల సంఖ్య కొత్తగా 80,287 పెరగడం ఆందోళన చెందాల్సిన అంశమని వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 3,76,18,271
  • మొత్తం మరణాలు: 4,86,761
  • యాక్టివ్ కేసులు: 17,36,628
  • మొత్తం కోలుకున్నవారు: 3,53,94,882

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారంతో పోల్చితే సోమవారం కేసుల సంఖ్య 8.31 శాతం పెరిగాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 79,91,230 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,58,04,41,770కు చేరింది.

Vaccine for 12-14 in India: 15 ఏళ్ల లోపు చిన్నారులకు టీకా పంపిణీ చేయనున్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. 12-14 ఏళ్ల టీనేజర్లకు టీకా ఇవ్వాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 19,79,856 మందికి కరోనా సోకింది. 4,987 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 33,12,64,767కి చేరగా.. మరణాలు 55,63,226కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 3,89,553 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 468 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.7 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 1,02,144 కేసులు వెలుగుచూశాయి. మరో 296 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో మరో 84,429 మంది వైరస్ బారిన పడ్డారు.​ 85 మంది మృతి చెందారు.
  • ఇటలీలో 83,403 కొత్త కేసులు బయటపడగా.. 287 మంది మరణించారు.
  • స్పెయిన్​లో 1,10,489 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 78 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 76,345 మందికి సోకగా.. 162 మంది వైరస్​తో చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 1,02,458 కరోనా కేసులు బయటపడగా.. 191 మంది బలయ్యారు. జర్మనీలో 53,916 మందికి వైరస్ సోకింది. మరో 143 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి: కరోనా చికిత్సకు రెమ్​డెసివిర్​, టోసిలిజుమాబ్​!

మహారాష్ట్ర, కర్ణాటకలో తగ్గిన కరోనా కేసులు.. కేరళలో భారీగా..

Last Updated : Jan 18, 2022, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.