India covid cases: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 90,928 కేసులు వెలుగుచూశాయి. మరో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. 19,206 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
- మొత్తం మరణాలు: 4,82,876
- యాక్టివ్ కేసులు: 2,85,401
- కోలుకున్నవారు: 3,43,41,009
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం మరో 91,25,099 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,48,67,80,227 కు చేరింది.
చిన్నారులకు వ్యాక్సినేషన్..
Vaccination For 15 To 18 Years: కరోనా టీకా పంపిణీలో భారత్ కీలక మైలురాయిని అందుకుంది. కోటి మందికిపైగా టీనేజర్లకు టీకా మొదటి డోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన మూడు రోజులకే ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. ఇప్పటివరకు పిల్లలకు మొత్తం 1,24,02,515 టీకా డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
ఒమిక్రాన్ వ్యాప్తి..
Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అందులో 995 మంది కోలుకున్నట్లు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 797 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత దిల్లీలో 485 మందికి కొత్త వేరియంట్ సోకింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..
corona cases in world: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజే 25,35,852 కేసులు వెలుగులోకి వచ్చాయి. 7,214 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 7,04,661 కేసులు నమోదయ్యాయి. 1,802 మంది ప్రాణలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,53,612 చేరింది.
- ఫ్రాన్స్‌లో3,32,252 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 246 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,24,809కు చేరింది.
- బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,94,747కేసులు నమోదయ్యాయి. 343 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
- ఇటలీలో1,89,109 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 183 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 6,756,035కు పెరిగింది. మరణాల సంఖ్య 1,38,276కు చేరుకుంది.
- టర్కీలో కొత్తగా 66,467 కేసులు నమోదు అయ్యాయి. 143 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: అమెరికాలో 95శాతం ఒమిక్రాన్ కేసులే.. ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయిలో..