IGNOU Typist And Stenographer Jobs 2023 : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) 102 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (JAT) , స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు
- యూఆర్ - 19 పోస్టులు
- ఓబీసీ - 14 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 5 పోస్టులు
- ఎస్సీ - 8 పోస్టులు
- ఎస్టీ - 4 పోస్టులు
- మొత్తం పోస్టులు - 50
స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు
- యూఆర్ - 23 పోస్టులు
- ఓబీసీ - 14 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 5 పోస్టులు
- ఎస్సీ - 7 పోస్టులు
- ఎస్టీ - 3 పోస్టులు
- మొత్తం పోస్టులు - 52
విద్యార్హతలు
IGNOU Typist And Stenographer Qualifications :
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ :
- 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- కంప్యూటర్లో 40 w.p.m వేగంతో ఇంగ్లీష్, 35 w.p.m వేగంతో హిందీ టైప్ చేయగలగాలి.
- Desirable : బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
స్టెనోగ్రాఫర్ :
- 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- కంప్యూటర్లో 40 w.p.m వేగంతో ఇంగ్లీష్ టైప్ చేయగలగాలి. 35 w.p.m వేగంతో హిందీ టైప్ చేయగలగాలి.
- షార్ట్ హ్యాండ్ టెస్ట్‌లో 80 w.p.m వేగంతో టైప్ చేయాల్సి ఉంటుంది.
- Desirable : బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారికి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి
IGNOU Typist And Stenographer Age Limit :
- 2023 డిసెంబర్ 12 నాటికి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- 2023 డిసెంబర్ 12 నాటికి స్టెనోగ్రాఫర్ అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు
IGNOU Typist And Stenographer Application Fee :
- యూఆర్, ఓబీసీ అభ్యర్థులు - రూ.1000
- ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు - రూ.600
- దివ్యాంగులు - ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
IGNOU Typist And Stenographer Selection Process : అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
IGNOU Typist And Stenographer Salaries :
- జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌లకు నెలకు రూ.19,900 - రూ.63,200 చొప్పున జీతం ఉంటుంది.
- స్టెనోగ్రాఫర్లకు నెలకు రూ.25,500 - రూ.81,100 చొప్పున జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం
IGNOU Typist And Stenographer Application Process :
- అభ్యర్థులు ముందుగా https://curec.ntaonline.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- University Recruitment ఆప్షన్లలో.. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)ని ఎంచుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలను నమోదు చేయాలి.
- మీ ఫొటోగ్రాఫ్ సహా, అవసరమైన పత్రాలు అన్నింటినీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.
- ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు మొత్తం చెల్లించాలి.
- ఎగ్జామినేషన్ సెంటర్‌ను కూడా ఎంచుకోవాలి.
- వివరాలు అన్నింటినీ మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
IGNOU Typist And Stenographer Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్ 1
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 21
- అప్లికేషన్ కరెక్షన్కు అవకాశం : డిసెంబర్ 22 నుంచి 25వ తేదీ వరకు
డిగ్రీ అర్హతతో AAICLASలో 906 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!
విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో 275 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!