IFFCO Recruitment 2023 Notification : న్యూదిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (ఇఫ్‌కో) లిమిటెడ్.. తమ సంస్థలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవిదేశాల్లో స్థాపితమైన ఇఫ్‌కో కేంద్రాలు/ కార్యాలయాలు/ ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీల వివరాలు..
అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు
విద్యార్హతలు..
- బీఎస్సీ(అగ్రికల్చర్)లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- జనరల్/ ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు కనీసం 55% మార్కులతో పాసై ఉండాలి.
- 2023 నవంబర్ నాటికి చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి..
2023 ఆగస్టు 01 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు..
ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.33,000 స్టైపెండ్ లభిస్తుంది. అనంతరం రూ.37,000-రూ.70,000 జీతంతో పాటు ఇతర అలెవెన్సులు అందుకుంటారు.
ఎంపిక విధానం..
- ప్రిలిమినరీ(కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్)
- ఫైనల్ (ఆన్‌లైన్ టెస్ట్).
- పర్సనల్ ఇంటర్వ్యూ.
- అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు..
అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, లఖ్‌నవూ, నాగ్‌పుర్, గువాహటి, పట్నా, రాయ్‌పుర్, సూరత్, వారణాసి, చండీగఢ్, దేహ్రాదూన్, పుణె, హైదరాబాద్, విజయవాడ, కొచ్చిన్, జోధ్‌పుర్, జమ్మూ, శిమ్లా, భోపాల్, జబల్‌పూర్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2023 అక్టోబర్ 7
బ్యాంకింగ్ అప్రెంటీస్ ఉద్యోగాలు..
Karur Vysya Bank Recruitment 2023 : కరూర్ వైశ్య బ్యాంక్ లిమిటెడ్.. తమ సంస్థలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆ వివరాలు ఉన్నాయి.
పోస్టులు :
బ్యాంకింగ్ అప్రెంటీస్
విద్యార్హతలు..
నాన్ గ్రాడ్యూయేషన్ కోర్సులు చదివి ఉండాలి. 2022, 2023లో సంబంధిత కోర్సు పూర్తి చేసి.. 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయస్సు..
2023 మార్చి 31 నాటికి 20 నుంచి 24 మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఇతర వివరాలు..
ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం ఉండాలి. పని చేసే ప్రదేశంలో స్థానిక భాష తెలిసి ఉండాలి.
దరఖాస్తు చివరి తేది..
2023 సెప్టెంబర్ 30 చివరి తేది. ఆల్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.