IB ACIO Jobs 2023 : మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
IB ACIO Job Details : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ - గ్రేడ్ II ఎగ్జిక్యూటివ్
- యూఆర్ - 377 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 129 పోస్టులు
- ఓబీసీ - 222 పోస్టులు
- ఎస్సీ - 134 పోస్టులు
- ఎస్టీ - 133 పోస్టులు
- మొత్తం పోస్టులు - 995
విద్యార్హతలు
IB ACIO Qualifications : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
IB ACIO Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 డిసెంబర్ 15 నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
IB ACIO Application Fee :
- అభ్యర్థులు అందరూ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.450 చెల్లించాలి. దీనికి తోడు..
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (పురుషులు) అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మాత్రం అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక ప్రక్రియ
IB ACIO Selection Process : అభ్యర్థులకు ముందుగా టైర్-1, టైర్-2 పరీక్షలను నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
జీతభత్యాలు
IB ACIO Salary : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం అందిస్తారు.
దరఖాస్తు విధానం
IB ACIO Selection Process :
- అభ్యర్థులు ముందుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన అధికారిక వెబ్సైట్ https://www.mha.gov.in/en ఓపెన్ చేయాలి.
- ఈ వెబ్సైట్లో మీ పేరు మీద ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.
- అకౌంట్ క్రియేట్ చేసుకున్న తరువాత, దానిలోకి లాగిన్ అవ్వాలి.
- అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ లింక్‌ను ఓపెన్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- వివరాలన్నీ మరోసారి సరిచూసుకుని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
పరీక్ష కేంద్రాలు
IB ACIO Recruitment Exam Centers :
- ఆంధ్రప్రదేశ్‌లోని పరీక్ష కేంద్రాలు : విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, చీరాల, తిరుపతి, కడప, కర్నూలు, ఆనంతపురం
- తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్
ముఖ్యమైన తేదీలు
IB ACIO Apply Last Date :
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2023 నవంబర్ 25
- ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 15
- అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 19
PGCILలో 203 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!
డిగ్రీ, డిప్లొమా అర్హతతో BHELలో 680 అప్రెంటీస్ పోస్టులు - అప్లైకు మరో 6 రోజులే ఛాన్స్!
డిగ్రీ విద్యార్ఖులకు గుడ్‌న్యూస్- IDBI బ్యాంకులో 2100 ఉద్యోగాలు- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?