ETV Bharat / bharat

మరో రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే యువతిని.. - పెళ్లికూతురు ఫైర్​

Bride Fired By Neighbour: మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న యువతికి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ విషాద ఘటన హరియాణాలో జరిగింది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Gurugram: Bride-to-be set on fire by jillted lover

author img

By

Published : May 10, 2022, 7:21 AM IST

Bride Fired By Neighbour: హరియాణాలో విషాదం నెలకొంది. మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోయే ఓ యువతిని తన ఇంటి ఎదుట ఉన్న వ్యక్తి నిప్పంటించాడు. ప్రస్తుతం ఆ యువతి 50 శాతానికిపైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.

ఇదీ జరిగింది.. హరియాణా గురుగ్రామ్ జిల్లాలోని ఫరూఖ్​నగర్​ ప్రాంతంలో ఓ యువతి (24) మరో రెండురోజుల్లో వివాహం చేసుకోనుంది. ఆమె ఎదురింట్లో ఉండే జైపాల్​ అలియాస్​ బిల్లు తరచూ ఆమెను వేధించేవాడు. అయితే ఆ యువతికి మరో రెండు రోజుల్లో పెళ్లి అని తెలిసి తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు. తమ కుమార్తెను ఇంట్లోకి లాక్కుని వెళ్లి మరి నిప్పంటించాడని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫరూఖ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీలైనంత త్వరగా నిందితుడిని అరెస్టు చేస్తామని పటౌడీ ఏసీపీ హరిందర్ కుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి: మనవడిపై బామ్మ పోలీసు కేసు.. పెంపుడు శునకం కరిచిందని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.