పెళ్లి అంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటారు. కానీ ఓ వివాహితుడికి మాత్రం 'వందేళ్ల మంట'గా అనిపించింది. దానికి కారణం అతను ఇష్టపడి చేసుకున్న భార్యే! ఆమె వేధింపులకు భయపడిపోయాడు. ఇంట్లో ఉంటే ఆమె చూపించే నరకం తట్టుకోలేనని అతడికి అర్థమైపోయింది. అందుకే ఇంట్లో ఉండడం కంటే జీవితాతం జైలులో గడపడం నయం అనుకున్నాడు. ఏం చేస్తే పోలీసులు పట్టుకుంటారో అర్థంకాక.. చివరికి ఏకంగా పోలీస్ ష్టేషన్కే నిప్పంటించేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది.

'చుక్కలు చూపిస్తోంది.. నన్ను అరెస్ట్ చేయండి..'
పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించి ఆ వ్యక్తి ఎక్కడకి పారిపోలేదు. 'నన్ను అరెస్ట్ చేయండి' అంటూ.. ఠాణా ముందే నిల్చుండిపోయాడు. అందుకు తగ్గట్టుగానే.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు గాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. పెళ్లి అయిన కొద్దిరోజుల నుంచే తన భార్య వేధింపులకు గురి చేయడం ప్రారంభించిందని బాధపడ్డాడు. ఆమె నుంచి విముక్తి పొందడానికి బజరంగ్వాడిలోని స్టేషన్‌కు నిప్పంటించినట్లు పేర్కొన్నాడు.

ఆయనో మానసిక రోగి..!
పోలీస్ స్టేషన్‌కు నిప్పు అంటించిన ఆ వ్యక్తి మానసిక స్థితి బాగోలేదని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Krishna Janmashtami: 200 మంది చిన్నారుల మధుర 'వేణుగానం'