ETV Bharat / bharat

చెవికి చికిత్స పేరుతో జంట హత్యలు.. ఇంజెక్షన్​ ఓవర్​డోస్​తో తల్లీకూతుళ్లు బలి

గుజరాత్​లో జంట హత్యలు కలకలం సృష్టించాయి. అహ్మదాబాద్‌లోని ఓ ఇ.ఎన్​.టి ఆసుపత్రిలో తల్లీకూతుళ్లు హత్యకు గురయ్యారు. ఆసుపత్రి కాంపౌండర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం వచ్చిన వారికి అధిక డోస్​ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు కాంపౌండర్. కాగా దిల్లీలో మత్తు మందు కలిపిన కూల్​డ్రింక్​ను తాగించి.. మహిళపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు.

Twin murders in Gujarat ENT haspital
గుజరాత్​ ఈఎన్​టీలో జంట హత్యలు
author img

By

Published : Dec 22, 2022, 4:51 PM IST

Updated : Dec 22, 2022, 7:21 PM IST

గుజరాత్​లోని ఓ ఇ.ఎన్​.టి ఆసుపత్రిలో దారుణం జరిగింది. తల్లీకూతుళ్లను హత్య చేశాడు ఆసుపత్రి కాంపౌండర్. చెవికి చికిత్స కోసం వచ్చిన వారిని.. డాక్టర్​లాగా చికిత్స అందించి చంపేశాడు. అధిక డోస్​ ఇంజక్షన్ ఇచ్చి తల్లీకూతుళ్ల చావుకు కారణమయ్యాడు. అహ్మదాబాద్‌, కాగ్రాపీఠ్​లోని కర్ణ ఇ.ఎన్​.టి ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసుపత్రిలో కాంపౌండర్​గా పనిచేస్తున్న మన్సుఖ్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. గత 15 సంవత్సరాలుగా అతడు ఈ హాస్పిటల్​లో పనిచేస్తున్నాడు. అయితే భారతీబెన్ అనే మహిళ చెవి నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె తన తల్లి చంపాబెన్​తో కలిసి కాగ్రాపీఠ్​లోని కర్ణ ఇ.ఎన్​.టి ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి ఓ వైద్యుడ్ని సంప్రదించింది. పరీక్షల అనంతరం చెవికి ఆపరేషన్​ చేయాలని, అందుకు రూ. 30వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు డాక్టర్​. దీంతో తల్లీకూతురు ఖర్చుకు వెనుకాడి తిరిగి ఇంటికి వచ్చారు. వాళ్ల బలహీనతను ఆసరాగా తీసుకున్న కాంపౌండర్ మన్సుఖ్.. రూ. 5వేలకే ఆపరేషన్​ చేస్తానని నమ్మించాడు. అందుకు ఆ తల్లీకూతుళ్లు ఒప్పుకున్నారు.

డాక్టర్​ లేని సమయంలో భారతీబెన్​కు చికిత్స చేశాడు కాంపౌండర్. ఒక చెవికి చికిత్స బాగానే చేసినా.. మరో చెవికి వైద్యం చేసే సమయంలో ఆమె చనిపోయింది. అనంతరం భారతీబెన్ తల్లి.. చంపాబెన్​నూ అధిక డోస్​ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడు. ఆసుపత్రిలో అల్మారాలో మృతదేహాలను ఉంచాడు. ఆ సమయంలో గంట పాటు ఆసుపత్రి సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా చేశాడు.

మృతదేహాలను గమనించిన ఆసుపత్రి సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు. మన్సుఖ్​ ఈ దారుణానికి పాల్పడ్డట్లుగా తేల్చారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే మన్సుఖ్ మృతులకు బంధువని పోలీసు విచారణలో తేలింది.

మహిళపై అత్యాచారం..
మత్తు మందు కలిపిన కూల్​డ్రింక్​ తాగించి.. మహిళపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు. దేశ రాజధాని దిల్లీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ తన కుటుంబంతో కలిసి సమయపుర్ బద్లీలో నివాసం ఉంటుంది. కొద్ది నెలల క్రితం ఆమెకు.. తన ఇంటి ముందున్న ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోన్ నంబర్లు ఒకరికొకరు ఇచ్చుకున్నారు. అనంతరం ఫోన్​లో మాట్లాడుకునేవారు. అప్పుడప్పుడు లిబాస్​పుర్ అనే ప్రాంతంలో కలుసుకునే వారు. ఒకరోజు మహిళకు ఫోన్​ చేసిన నిందితుడు.. ఆమెను లిబాస్​పుర్​కు రమ్మన్నాడు. రోహిణి సెక్టార్ 18లోని ఓ హోటల్​కు మహిళను తీసుకెళ్లాడు. మత్తు మందు కలిపిన కూల్​డ్రింక్​ను ఆమెతో తాగించాడు. అనంతరం మహిళపై అత్యాచారం చేశాడు.

"కూల్​డ్రింక్​ తాగిన వెంటనే నేను సృహ కోల్పోయాను. మెలుకువ వచ్చే సరికి ఒంటిపై బట్టలు లేవు. అతన్ని నిలదీయగా, తన దగ్గర నా వీడియోలు ఉన్నాయని, అవి నా భర్తకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు" అని బాధితురాలు వాపోయింది. వీడియోలను ఆసరాగా చేసుకున్న ఆ యువకుడు.. పలుమార్లు బాధిత మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతని వేధింపులు తట్టుకోలేని ఆమె.. చివరకు పోలీసులకు ఆశ్రయించింది. ఘటనపై వారికి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలికి కౌన్సిలింగ్​ ఇచ్చినట్లు చెప్పారు. విచారణ జరుపుతున్నట్లు వారు వెల్లడించారు.

Last Updated : Dec 22, 2022, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.