ETV Bharat / bharat

మేము సైతం బాబు కోసం చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్​లో అపూర్వ స్వాగతం అడుగడుగునా నీరాజనం - స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో చంద్రబాబు అరెస్టు

Grand Welcome to Chandrababu in Hyderabad: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్‌లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయనను చూసేందుకు.. బేగంపేట విమానాశ్రయం వద్దకు టీడీపీ నాయకులు, ఐటీ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చంద్రబాబు వెంట కార్లు, బైకులతో వేలాది మంది అనుసరించారు.

Grand Welcome to Chandrababu in Hyderabad

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 9:03 PM IST

Updated : Nov 1, 2023, 9:53 PM IST

మేము సైతం బాబు కోసం చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్​లో అపూర్వ స్వాగతం అడుగడుగునా నీరాజనం

Grand Welcome to Chandrababu in Hyderabad : చంద్రబాబుకు హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం రాజమండ్రిలో జనసందోహం పోటెత్తగా.. ఇవాళ బేగంపేట విమానాశ్రయాన్ని అభిమాన సంద్రం ముంచెత్తింది. భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు, వేలాది మంది అభిమానులు.. ఆయనకు పూల వర్షం కురిపిస్తూ అద్భుత స్వాగతం పలికారు. అసంఖ్యాకంగా విమానాశ్రయానికి చేరుకున్న అభిమానగణం.. జై బాబు.. జైజై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. నిజమైన లీడర్, లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన విజనరీ అంటూ.. విమానాశ్రయ ప్రాంతం దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఆయన వల్లే ఉన్నతస్థానాల్లో ఉన్నామని, ఊహించనంత అత్యుత్తమ జీవితాలను గడుపుతున్నామని గుర్తుచేసుకున్నారు.

నాయకుడంటే రాజకీయాలు చేయడం మాత్రమే కాదు.. సమాజ పురోభివృద్ధికి, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు పాటుపడిన వారే అసలు సిసలు నాయకుడనే విషయాన్ని.. చంద్రబాబు చాటి చెప్పారని ప్లకార్డులు ప్రదర్శించారు. "వుయ్ ఆర్ విత్ చంద్రబాబు", "మేము సైతం బాబు కోసం", "సైకో పోవాలి..సైకిల్ రావాలి" అంటూ ఐటీ ఉద్యోగులు గర్జన చేశారు. మళ్లీ చంద్రబాబు పాలన వస్తేనే నవ్యాంధ్ర బాగుపడుతుందని ఆకాంక్షించారు. తెలుగుదేశం జెండాలు, చంద్రబాబు ఫ్లెక్సీలు చేతబట్టుకుని.. మీకు తోడుగా మేమున్నామంటూ అభిమాననేతకు సంఘీభావం తెలిపారు.

TDP Chief Chandrababu Naidu Comments: 'నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజల అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను'

TDP Chief Chandrababu Arrived Hyderabad : వెల్లువెత్తిన అభిమాన సంద్రాన్ని దాటుకుని ముందుకు సాగడం.. చంద్రబాబుకు కష్టతరమైంది. అభిమానులను పక్కుకు పంపించి.. చంద్రబాబు వాహనశ్రేణిని ముందుకు పంపడం పోలీసులకు సాధ్యపడలేదు. ఎయిర్ పోర్టు లోపలి నుంచి చంద్రబాబు వాహనశ్రేణి.. ప్రధాన రహదారిపైకి రావడానికే గంటకు పైగా సమయం పట్టింది. వేలాది మంది యువకులు.. బైకులపై చంద్రబాబు వాహనశ్రేణిని అనుసరిస్తూ, హారన్ మోగిస్తూ కాన్వాయ్ వెంట వెళ్లారు. ప్రధాన రహదారిపైకి వచ్చాక కూడా అదే పరిస్థితి నెలకొంది. పోటెత్తిన అభిమానుల మధ్య కాన్వాయ్ ముందుకు సాగింది. కోర్టు నిబంధనల మేరకు కారు లోపలే ఉన్న చంద్రబాబు.. తెలుగుదేశం నాయకులు, అభిమానులకు అభివాదం చేస్తూ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు.

చంద్రబాబును కలిసిన ఏఐజీ వైద్య బృందం : జూబ్లీహిల్స్​లోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబును ఏఐజీ వైద్యుల బృందం కలిసింది. చంద్రబాబు తాజా ఆరోగ్య పరిస్థితి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు గురువారం ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఈమేరకు ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేయనున్నారు.

మంగళవారం హైకోర్టు ఉత్తర్వులతో స్కిల్​ డెవలప్​మెంట్​ అక్రమ కేసులో మధ్యంతర బెయిల్​పై జ్యుడిషియల్​ కస్టడీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదలయ్యారు. ఆయనను చూసేందుకు చంద్రబాబు అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జైలు నుంచి బయటకు అడుగుపెడుతూ.. టీడీపీ శ్రేణులకు అభివాదం చేసిన చంద్రబాబు.. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. ఆయనను చూసేందుకు జనం పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చారు. రాజమండ్రిని నుంచి విజయవాడ చంద్రబాబు నివాసం చేరేందుకు దాదాపు 13 గంటలు సమయం పట్టిందంటేనే జనాలు ఏ రకంగా బ్రహ్మరథం పట్టారో అర్థం చేసుకోవచ్చు.

Chandrababu Bail Celebrations in Telangana : చంద్రబాబుకు బెయిల్.. తెలంగాణలో టీడీపీ శ్రేణుల సంబురాలు

Chandrababu Followers Highly Crowd on Roads: జనసంద్రమైన రోడ్లు.. ఉప్పొంగిన అభిమానం.. ఎక్కడ చూసినా సంబరాలే..

Last Updated : Nov 1, 2023, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.