ETV Bharat / bharat

గోవాలో కాంగ్రెస్​కు షాక్​.. ఐదుగురు ఎమ్మెల్యేలు దూరం.. త్వరలో భాజపాలోకి? - కాంగ్రెస్

గోవాలో కాంగ్రెస్​కు షాక్​ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో విపక్ష నేతగా ఉన్న మైఖెల్​ లోబోను ఆ పదవి నుంచి తప్పించింది కాంగ్రెస్. లోబో, దిగంబర కామత్​లు భాజపాతో కలిసి కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. మైఖెల్ లోబో తన భార్యతో కలిసి.. గోవా సీఎంను కలిశారు.

కాంగ్రెస్
కాంగ్రెస్
author img

By

Published : Jul 11, 2022, 5:30 AM IST

Updated : Jul 11, 2022, 6:54 AM IST

గోవాలో విపక్ష కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడింది. కాంగ్రెస్‌ పార్టీకి గోవా శాసనసభలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా... వారిలో ఐదుగురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు హస్తం పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్ శాసనసభాపక్షంలో చీలిక తెచ్చేందుకు మైఖెల్ లోబో, మాజీ సీఎం దిగంబర కామత్ అధికార భాజపాతో కలిసి కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ గోవా ఇంఛార్జ్​ దినేశ్ గుండూరావ్ ఆరోపించారు. విపక్ష నేతగా ఉన్న లోబోను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. లోబో, దిగంబర కామత్‌లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గోవాలో ప్రతిపక్షాన్ని అంతం చేసేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించారు.

సావంత్​తో భేటీ!
హస్తం పార్టీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరతారన్న ఊహాగానాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే లోబో, ఆయన భార్య.. భాజపా నేత, గోవా సీఎం ప్రమోద్ సావంత్​ను కలిశారు. ఈ విషయంపై స్పందించిన సావంత్.. సీఎంను కలిసేందుకు చాలా మంది వస్తుంటారని, అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున తాను ఆ పనుల్లో నిమగ్నమయ్యానని చెప్పుకొచ్చారు. ఇత పార్టీల సమస్యలపై తాను మాట్లాడబోనని అన్నారు.

మరోవైపు గోవాలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను గోవా వెళ్లాలని అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించారు. గోవా శాసనసభ సామర్థ్యం 40 మంది ఎమ్మెల్యేలు కాగా అధికార భాజపాకు 20 మంది శాసనసభ్యుల బలం ఉంది. ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు ఎంజీపీ సభ్యుల మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి : ఒడిలో తమ్ముడి మృతదేహం.. మదిలో పుట్టెడు దుఃఖం.. రోడ్డుపక్కనే 8ఏళ్ల బాలుడు

Last Updated : Jul 11, 2022, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.