General Bipin Rawat brother in law: అనుమతి లేకుండా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందని ఆరోపించారు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ బావమరిది యశోవర్ధన్ సింగ్. జాతీయ రహదారి పనుల కోసం తన భూమిని వినియోగిస్తున్నట్లు ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు.
తన సోదరి మధులికా రావత్, జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియల రోజు ఇది గుర్తించినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం అందించలేదని, ముందస్తు సమాచారమూ ఇవ్వలేదని యశోవర్ధన్ తెలిపారు.
''భూమి తీసుకున్నందుకు నాకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఎవరైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి.''
- యశోవర్ధన్ సింగ్
మధులిక స్వస్థలమైన మధ్యప్రదేశ్లోని రాజాబాఘ్ సోహగ్పుర్లోనే.. జాతీయ రహదారికి ఆనుకొని యశోవర్ధన్కు కొంత భూమి ఉంది. ప్రస్తుతం అక్కడే జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ విషయం జిల్లా కలెక్టర్ వందనా వైద్య వరకు చేరింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తానని, తహశీల్దార్ సహా ఇతర అధికారులను సంఘటనా స్థలానికి పంపుతామని ఆమె చెప్పారు. విచారణ అనంతరమే.. ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు.
ఇదే అంశంపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ట్వీట్ చేశారు. శహ్డోల్ ఎస్పీ నుంచి పూర్తి వివరాలు కోరిన ఆయన.. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
-
अगर पुलिस द्वारा किसी भी तरह का पूर्वाग्रह इस मामले में बरता गया है और किसी भी तरह की अवैधानिक कार्यवाही को प्रश्रय दिया है तो मैं खुद पूरे मामले को देखूगा और जो भी दोषी होगा उस पर कड़ी कार्रवाई होगी।
— Dr Narottam Mishra (@drnarottammisra) December 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">अगर पुलिस द्वारा किसी भी तरह का पूर्वाग्रह इस मामले में बरता गया है और किसी भी तरह की अवैधानिक कार्यवाही को प्रश्रय दिया है तो मैं खुद पूरे मामले को देखूगा और जो भी दोषी होगा उस पर कड़ी कार्रवाई होगी।
— Dr Narottam Mishra (@drnarottammisra) December 14, 2021अगर पुलिस द्वारा किसी भी तरह का पूर्वाग्रह इस मामले में बरता गया है और किसी भी तरह की अवैधानिक कार्यवाही को प्रश्रय दिया है तो मैं खुद पूरे मामले को देखूगा और जो भी दोषी होगा उस पर कड़ी कार्रवाई होगी।
— Dr Narottam Mishra (@drnarottammisra) December 14, 2021
హెలికాప్టర్ ప్రమాదంలో..
Chopper Crash: డిసెంబర్ 8న జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది ఆరోజే చనిపోగా.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయన 8 రోజులు మృత్యువుతో పోరాడి ఓడారు.
ఇవీ చూడండి: 'కొనప్రాణాలతో సీడీఎస్ రావత్.. నీళ్లు కావాలని అడిగారు'