ETV Bharat / bharat

'వీకెండ్స్​లో క్రికెట్ ఆడేందుకు భర్తను పంపుతా'.. వధువుతో బాండ్​ రాయించుకున్న వరుడి ఫ్రెండ్స్

పెళ్లిలో వధూవరులు స్నేహితుల హడావుడి అంతాఇంతా కాదు. వధూవరులిద్దరినీ ఆటపట్టిస్తుంటారు. అయితే తమిళనాడు మదురైలోని జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లి కుమార్తెతో ఏకంగా బాండ్​నే రాయించుకున్నారు వరుడి స్నేహితులు. ఆ బాండ్​లో ఏముందో, అసలెందుకు అలా చేశారో ఓసారి చూడండి.

Friends of the groom signed the bond
బాండ్ పేపరుపై వధువు సంతకం
author img

By

Published : Sep 11, 2022, 10:55 AM IST

తమిళనాడు మదురైలో ఓ విచిత్ర ఘటన జరిగింది. వారాంతాల్లో తన భర్త క్రికెట్​ ఆడేందుకు అనుమతిస్తానని బాండ్​​ పేపరుపై వధువుతో సంతకం చేయించుకున్నారు పెళ్లి కొడుకు స్నేహితుడు. ఇదేంటి ఇలా కూడా చేస్తారా.. అని అనుకుంటున్నారా? అయితే అలా ఎందుకు చేశారో ఓ సారి తెలుసుకోవాల్సిందే.

ఇదీ అసలు విషయం: హరిప్రసాద్ అనే వ్యక్తి.. తేనీలోని ఓ ప్రైవేట్​ కాలేజీలో లెక్చరర్​గా పనిచేస్తున్నాడు. ఆయన 'సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్​' జట్టుకు కెప్టెన్. హరిప్రసాద్ స్వస్థలం ఉసిలంపాటి సమీపంలోని కీజా పుదూర్ అనే గ్రామం. అతడికి మదురైకి చెందిన పూజ అనే యువతిని వివాహం కుదిరింది. అయితే ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్.

నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన పెళ్లికొడుకు స్నేహితులు.. పెళ్లి కుమార్తెకు ఓ షరతు విధించారు. శని, ఆదివారాల్లో హరిప్రసాద్​ను క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని పెళ్లి కుమార్తెను కోరారు. రూ.20 బాండ్ పేపరు మీద సంతకం చేయమన్నారు. ఆటపట్టించేందుకు చేస్తున్నారేమోనని పూజ అనుకుంది. అయితే బాండ్​పై సంతకం చేయమని పూజపై ఒత్తిడి తెచ్చారు హరిప్రసాద్ స్నేహితులు. అప్పుడు పూజ.. బాండ్​పై సంతకం చేసింది. "సూపర్ స్టార్ టీమ్ కెప్టెన్ అయిన నా భర్త హరిప్రసాద్‌ను ఇక నుంచి అన్ని శని, ఆదివారాల్లో క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తాను' అని హామీ ఇచ్చింది.

ఇవీ చదవండి: 2024 ఎన్నికలపై PK లేటెస్ట్ ఎనాలసిస్ ఇదీ.. KCR, నీతీశ్​పై కీలక వ్యాఖ్యలు

బాలికపై ఓ ఉన్మాది అత్యాచారయత్నం.. ఆపై కిరోసిన్​​ పోసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.