Gujarat Exit Polls 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా జోరు కొనసాగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అన్ని సంస్థల అంచనాల ప్రకారం గుజరాత్ లో భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని స్పష్టమైంది. ఏబీపీ-సీ ఓటర్ సర్వే ప్రకారం భాజపాకు 128 నుంచి 140 సీట్లు రానున్నాయి. కాంగ్రెస్‌కు 31 నుంచి 43, ఆమ్ఆద్మీకి 3 నుంచి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 182 స్థానాలకు భాజపా 125 నుంచి 143 సీట్లు గెల్చుకుంటుందని వెల్లడైంది. కాంగ్రెస్‌కు 30 నుంచి 48 స్థానాలు, ఆప్ మూడు నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని పేర్కొంది. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భాజపా 130 నుంచి 145 సీట్లు గెల్చుకోనుంది. కాంగ్రెస్ 25 నుంచి 35 సీట్లు, ఆమ్ ఆద్మీ 5 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని వెల్లడైంది.
ఆత్మసాక్షి సర్వే ప్రకారం భాజపాకు 98నుంచి 110 సీట్లు వస్తాయని తేలగా కాంగ్రెస్ 66 నుంచి 71 స్థానాలు, ఆప్ 9 నుంచి 14 సీట్లు గెల్చుకోనున్నాయి. న్యూస్ ఎక్స్ జన్‌కీ బాత్ సర్వే ప్రకారం భాజపా 117 నుంచి 140 సీట్లు సాధించనుంది. కాంగ్రెస్ 34 నుంచి 51 చోట్ల, ఆప్ 6 నుంచి 13చోట్ల గెలవనున్నాయి. రిపబ్లిక్ టీవీ-పీ మార్క్యూ సర్వేలోనూ భాజపాకు స్పష్టమైన ఆధిక్యం లభించింది. భాజపాకు 128 నుంచి 148 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 30 నుంచి 42, ఆమ్ఆద్మీకి 2నుంచి 10 సీట్లు రానున్నట్లు తేలింది.
టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే కూడా కమలం పార్టీకే జై కొట్టింది. ఇందులో భాజపాకు 139 సీట్లు రాగా కాంగ్రెస్ 30, ఆప్ 11 చోట్ల గెలుస్తాయని వెల్లడైంది. ఆజ్‌తక్-యాక్సిస్ మై ఇండియా సర్వే కూడా భాజపాకే స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టింది. భాజపాకు 129 నుంచి 151, కాంగ్రెస్‌కు 16 నుంచి 30, ఆమ్ఆద్మీకి 9 నుంచి 21 స్థానాలు రావచ్చని అంచనా వేసింది.
రిపబ్లిక్ టీవీ
- భాజపా 128-148
- కాంగ్రెస్ 30-42
- ఆప్ 2-10
జన్‌కీ బాత్
- భాజపా 117-140
- కాంగ్రెస్ 34-51
- ఆప్ 6-13
పీపుల్స్ పల్స్
- భాజపా 125-143
- కాంగ్రెస్ 30-48
- ఆప్ 3-7
ఔట్ ఆఫ్ ద బాక్స్
- భాజపా 130-145
- కాంగ్రెస్ 25-35
- ఆప్ 5-7
ఆత్మసాక్షి
- భాజపా 98-110
- కాంగ్రెస్ 66-71
- ఆప్ 9-14
న్యూస్ ఎక్స్
- భాజపా 117-140
- కాంగ్రెస్ 34-51
- ఆప్ 6-13
- ఇవీ చదవండి:
- ఎగ్జిట్ పోల్స్: హిమాచల్‌లో భాజపా- కాంగ్రెస్ హోరాహోరీ
- ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ రెండో దశ పోరు.. ఈవీఎంల్లో ప్రజా తీర్పు నిక్షిప్తం