ETV Bharat / bharat

ఉప్పు ఎక్కువైందని వంటమనిషి హత్య.. భర్త కాళ్లు, చేతులు కట్టేసి కిరోసిన్​తో నిప్పు.. - నాలుగేళ్ల బాలుడి చేయి విరిచిన దుండగులు

ఆహారంలో ఉప్పు ఎక్కువైందని ఓ వ్యక్తిని హత్య చేశారు ఇద్దరు దుండగులు. ఈ కేసును సినీ ఫక్కీలో ఛేదించారు పోలీసులు. మరో ఘటనలో భర్త కాళ్లూ చేతులు కట్టేసి కిరోసిన్​ పోసి నిప్పంటించింది భార్య.

brothers arrested for killing cook in Pune

author img

By

Published : Dec 10, 2022, 1:25 PM IST

ఆహారంలో ఉప్పు ఎక్కువైందని దాబాలో పనిచేసే వంట మనిషిని చంపేశారు. ఈ ఘటన అక్టోబర్​ 26న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పుణె పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిందితులను అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్​ 26న పుణెలోని ఓ దాబాలో పనిచేస్తున్న వంటమనిషిని.. ఆహారంలో ఉప్పు ఎక్కువైందనే కారణంతో చంపేశారు ఇద్దరు నిందితులు. కాగా, ఈ విషయం చాలా రోజుల వరకు ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత అందులో పనిచేసే మరో వ్యక్తి.. తన సొంత ఊరికి వచ్చి జరిగిన విషయాన్ని స్థానిక సామాజిక కార్యకర్తకు వివరించాడు. దీంతో ఆ కార్యకర్త పోలీసులను ఆశ్రయించి జరిగింది చెప్పాడు.

brothers held in Pune for murder
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సినీ ఫక్కీలో పోలీసుల వ్యూహం..
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మొదటగా ఆ దాబా వద్దకు వెళ్లారు. అందులో భోజనం ఆర్డర్​ చేసి తిన్నారు. ఈ క్రమంలో రహస్యంగా దాబా ఓనర్​ ఫొటోలు తీశారు. ఆ ఫోటోలు సామాజిక కార్యకర్త ద్వారా.. అందులో పని చేసిని వ్యక్తికి పంపిచారు. అతడు నిందితులను గుర్తుపట్టాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితులు మృతదేహాన్ని విసిరేస్తుండగా చూసిన సాక్షి ఒకరు పోలీసులకు చెప్పాడు. మృతుడిని ప్రసన్​జీత్​ గోరై(35) గా, నిందితులను ఓంకార్ కెంద్రే(21) కైలేశ్​ కేంద్రే(19)గా గుర్తించారు పోలీసులు. వీరిద్దరూ సోదరులని.. 'ఓంకార్​ దాబా'కు ఓనర్లని తెలిపారు. మొదట నిందితులు నేరాన్ని అంగీకరించలేక పోయినా.. ఆ తర్వాత ఒప్పుకున్నారు. ఆహారంలో ఉప్పు ఎక్కువైందని అతడిని చంపేశామన్నారు నిందితులు. అనంతరం అక్టోబర్​ 28న అర్ధరాత్రి మృతుడి దుస్తులు మార్చి ఓ కుంటలో వేశామని చెప్పారు. దీన్ని చూసిన ఓ వ్యక్తి మొదటి ఎవరితో చెప్పకపోయినా.. ఆ తర్వాత జరిగింది పోలీసులకు వివరించాడు.

భర్త కాళ్లూ చేతులు కట్టి.. కిరోసిన్​ పోసి నిప్పు..
కుటుంబ కలహాలు, వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ మహిళ.. అర్ధరాత్రి భర్తపై కిరోసిన్​ పోసి నిప్పంటించింది. ఈ ఘటన ఝార్ఖండ్​లోని చతరా జిల్లాలో సర్దార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జైపుర్​ గ్రామంలో జరిగింది. వినోద్​ భారతీ అనే వ్యక్తికి, తన భార్య రుంటీ దేవీకి తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. దీంతో విసుగు చెందిన భార్య అర్ధరాత్రి.. భర్త కాళ్లు చేతులు కట్టేసి.. అతడి చూట్టూ కొన్ని దుస్తులు చుట్టింది. ఓ గదిలో వేసి అతడిపై కిరోసిన్​ పోసి నిప్పంటించింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిందితురాలిని అరెస్టు చేశారు. కాగా, ఇంతక ముందు కూడా నిందితురాలు వినోద్​​ను హతమార్చేందుకు ప్రయత్నించిందని పోలీసుల విచారణలో తెేలింది.

బాలుడి ఛాతిపై కాలు పెట్టి.. చేయి విరిగేదాకా..
బిహార్​లో అమానవీయ ఘటన జరిగింది. ఓ నాలుగేళ్ల చిన్నారిని కొందరు దారుణంగా కొట్టారు. అతడి ఛాతిపై కాలుపెట్టి చేతిని విరిచారు. రిఫైనరీ ఓపీ ప్రాంతంలోని మొసాద్​పుర్​ అనే గ్రామంలో ఓ వేడుకలో భాగంగా డిజే ఏర్పాటు చేశారు. డ్యాన్స్​ వేస్తున్న క్రమంలో శివరాజ్​ కుమార్​ అనే వ్యక్తి కుమారుడు కింద పడి గాయపడ్డాడు. దీనికి శివరాజ్​ కుమార్​​ పొరుగింట్లో ఉండే ప్రియాన్షు కుమార్​ అనే బాలుడే కారణమని భావించారు.
అనంతరం శివరాజ్​ భార్యతో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రియాన్షు ఇంటికొచ్చి దాడి చేశారు. ఆ తర్వాత అతడి ఛాతిపై కాలు పెట్టి, చేయి విరిగే వరకు అలాగే ఉంచారు. ఈ మేరకు బాలుడి తల్లి ఆర్తీ దేవీ చెప్పింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని.. అతడి కుటంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.