ETV Bharat / bharat

ఠాక్రేపై 'ఆటో- మెర్సిడెస్' పంచ్.. డ్రమ్స్ వాయిస్తూ శిందేకు భార్య స్వాగతం

author img

By

Published : Jul 6, 2022, 12:37 PM IST

Updated : Jul 6, 2022, 1:19 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందేకు ఠాణెలో ఘన స్వాగతం లభించింది. ఆయన భార్య లత.. డ్రమ్స్ వాయిస్తూ ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఠాక్రేకు చురకలు అంటించారు సీఎం శిందే. ఆటో రిక్షా వేగానికి మెర్సిడెస్‌ వెనుకబడిపోయిందంటూ ఠాక్రేకు కౌంటర్‌ ఇచ్చారు.

Eknaths Shinde rickshaw Mercedes
Eknaths Shinde rickshaw Mercedes

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందేకు తన స్వస్థలంలో ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం మంగళవారం ఠాణె వెళ్లగా ఆయన మద్దతుదారులు ఘనంగా ఆహ్వానించారు. శిందే భార్య లత.. డ్రమ్ములు వాయిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన తన మాజీ బాస్‌, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఆటో రిక్షా వేగానికి మెర్సిడెస్‌ వెనుకబడిపోయిందంటూ ఠాక్రేకు కౌంటర్‌ ఇచ్చారు.

శిందేకు భార్య లత ఘన స్వాగతం

"ఆటో రిక్షా వేగానికి మెర్సిడెస్‌(ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశిస్తూ) వెనుకబడింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసమే. ఈ ప్రభుత్వం ప్రతి వర్గానికీ న్యాయం జరిగేలా చూస్తుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఇది మా సొంత ప్రభుత్వమే.. మా కోసమే పనిచేస్తుంది అనేలా కొత్త సర్కారు నిర్ణయాలు ఉంటాయి. అదే గత ప్రభుత్వానికి మా సర్కారుకు తేడా" అని విమర్శించారు. ఇదే విషయాన్ని శిందే ట్విట్టర్‌లోనూ రాసుకొచ్చారు.

Eknaths Shinde rickshaw Mercedes
శిందే ట్వీట్

ఇటీవల కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. ఠాక్రే విమర్శలు చేశారు. "మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని భాజపా ఎప్పుడూ మూడు చక్రాల ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేసేది. ఇప్పుడు ఆ మూడు చక్రాలు నడిపే వ్యక్తికే రాష్ట్ర పగ్గాలు అప్పగించింది" అని ఠాక్రే వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. శిందే కెరీర్‌ తొలినాళ్లలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆటో నడిపారు. ఈ నేపథ్యంలోనే ఠాక్రే వ్యాఖ్యలపై తాజాగా స్పందిస్తూ కౌంటర్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఠాక్రే సర్కారుపై తిరుగుబాటు గురించి కూడా శిందే ప్రస్తావించారు. "మేం ఏదీ చట్టానికి వ్యతిరేకంగా చేయలేదు. రాజ్యాంగం, నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నాం. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న మాకు 2/3 వంతుల మెజార్టీ ఉంది. అందుకే స్పీకర్‌ కూడా మమ్మల్ని గుర్తించారు. విశ్వాస పరీక్షలోనూ మేం నెగ్గాం. మాది బలమైన ప్రభుత్వం" అని చెప్పుకొచ్చారు. అనంతరం భాజపా మద్దతు గురించి మాట్లాడుతూ.. "భాజపా అధికారం కోసం ఏదైనా చేస్తుందని ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. నిజానికి మహారాష్ట్రలో భాజపాకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రభుత్వాన్ని నడిపే అవకాశం మాకు కల్పించింది. మా హిందుత్వ విధానాలు నచ్చి మాకు మద్దతిచ్చింది" అని కొనియాడారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 6, 2022, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.