తల్లి పక్కనే నిద్రిస్తున్న ఎనిమిది నెలల బాలుడిపై అడవి పిల్లి విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి మరణించగా.. ఆమె తల్లి గాయపడింది. ఈ దారుణం ఉత్తర్‌ప్రదేశ్.. ప్రతాప్‌గఢ్‌లో గురువారం జరిగింది.
ఇదీ జరిగింది..
మహులికు చెందిన అజయ్ గౌర్‌కు ఐదుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నాడు. అజయ్.. రాజస్థాన్‌కు కూలీ పనుల నిమిత్తం వలస వెళ్లాడు. అతడి భార్య ఉమ.. గురువారం అర్ధరాత్రి తన 8 నెలల కుమారుడు రాజ్‌తో కలిసి నిద్రిస్తోంది. హఠాత్తుగా ఓ అడవి పిల్లి కిటికీలోంచి వారి గదిలోకి ప్రవేశించింది. విచక్షణారహితంగా రాజ్ శరీరంపై గోళ్లుతో దాడి చేసింది. ఉమను కూడా గాయపరిచి.. అక్కడి నుంచి అడవి పిల్లి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గదికి చేరుకుని చూసేసరికి రక్తపు మడుగులో రాజ్ కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మరణించాడు.
ప్రొఫెసర్ ఆత్మహత్య..
అసోం.. గువహటిలో దారుణం జరిగింది. ఐఐటీ గువహటికి చెందిన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్.. క్యాంపస్‌లోని క్వార్టర్స్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడిని సమీర్ కలాంగా గుర్తించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
బస్సులో నుంచి తప్పించుకునేందుకు..
సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలను పోలీసు బస్సులో తరలిస్తుండగా ఒక ఖైదీ తప్పించుకోగా.. మరో ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని లుధియానాలో జరిగింది. పరారీలో ఖైదీ ఉన్న దీపక్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 37 మంది ఖైదీలు బస్సులో ఉన్నారని పోలీసులు తెలిపారు.
మహిళా సెక్యూరిటీపై దాడి..
హరియాణా గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. సొసైటీలో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డుపై 60 ఏళ్ల వృద్ధురాలు కర్రతో దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు వాటర్ హీటర్‌ను ఉపయోగించడాన్ని నిందితురాలు నిరాకరించింది. బాధితురాలిని సోనీ దేవిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.