ETV Bharat / bharat

ECIL Recruitment 2023 Notification : హైదరాబాద్ ECIL​లో భారీగా ఉద్యోగాలు.. ఫ్రెషర్స్​కు మంచి ఛాన్స్

ECIL Recruitment 2023 Notification : హైదరాబాద్​లోని ఈసీఐఎల్​లో పలు అప్రెంటిస్‌షిప్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది ఆ సంస్థ. మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ecil-recruitment-2023-notification-ecil-apprenticeship-jobs-for-freshers-hyderabad
ఈసీఐఎల్​ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 11:11 AM IST

Updated : Sep 23, 2023, 1:29 PM IST

ECIL Recruitment 2023 Notification : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌).. తమ సంస్థలో పలు అప్రెంటిస్‌షిప్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. హైదరాబాద్‌లోనే ఉన్న ఈ సంస్థలో మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఎంపికైన వారికి 2023 సంవత్సరం నాటికి ట్రేడ్ అప్రెంటిస్‌షిప్​లో భాగంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. అందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

ఖాళీల వివరాలు..

  • ఈఎం- 190
  • ఎలక్ట్రీషియన్- 80
  • ఫిట్టర్- 80
  • ఆర్‌ అండ్‌ ఏసీ- 20
  • టర్నర్- 20
  • మెషినిస్ట్- 15
  • మెషినిస్ట్(జి)- 10
  • సీఓపీఏ- 40
  • వెల్డర్- 25
  • పెయింటర్‌- 4
  • మొత్తం ఖాళీల సంఖ్య: 484

అర్హతలు..
ECIL Apprenticeship 2023 Eligibility Criteria : అభ్యర్థికి 2023 అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని తెలిపింది ఈసీఐఎల్​. సంబంధిత ట్రేడ్‌ విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థికి ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ట్రైనింగ్​ సమయంలో నెలకు రూ. 7,700 నుంచి రూ.8,050 వరకు స్టైపెండ్​ అందిస్తామని తెలిపిన ఈసీఐఎల్​.. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించింది.

ముఖ్య తేదీలు..
ECIL Apprenticeship 2023 Apply Online Dates

  1. ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ప్రారంభం: 2023 సెప్టెంబర్ 25
  2. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.10.2023 అక్టోబర్ 10
  3. ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 2023 అక్టోబర్​ 16 నుంచి 21 వరకు.
  4. ప్రవేశానికి గడువు తేదీ: 2023 అక్టోబర్ 10
  5. అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభ తేది : 2023 నవంబర్​ 1

ECIL Recruitment ITI 2023 : అన్ని ఎంపిక పక్రియలు పూర్తైన తరువాత హైదరాబాద్​లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్‌ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్, ఈసీఐఎల్​ వంటి తదితర ప్రదేశాల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్​ ఉంటుందని సంస్థ తెలిపింది. పూర్తి సమాచారం కోసం తమ అధికారిక వెబ్​సైట్​ ecil.co.inను సందర్శించాలని సూచించింది ఈసీఐఎల్​.

NFC Apprentice Jobs : ఐటీఐ అర్హతతో.. హైదరాబాద్​లోని ఎన్​ఎఫ్​సీలో అప్రెంటీస్​ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా!

Central Railway Recruitment 2023 : రైల్వేలో స్పోర్ట్స్ కోటా జాబ్స్.. మేనేజర్ ఉద్యోగాలు కూడా.. అప్లై చేశారా?

Last Updated : Sep 23, 2023, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.